Six arrested for nuisance at Uppal stadium ఉప్పల్ స్టేడియంలో టీవీ నటి సహా అరుగురి అరెస్ట్

Tv actress among six arrested for nuisance at uppal stadium

Six arrested at Uppal stadium, Tv actress arrested at Uppal stadium, Telugu TV actor, Tv actress Prashanthi, nuisance case on TV actor and Frients, IPL match Uppal stadium, uppal Rajiv Gandhi International Cricket Stadium, three women including tv actor arrested, three men arrested at uppal stadium, crime

Six persons including three women were arrested by the Uppal police for allegedly creating nuisance during the IPL match at Rajiv Gandhi International Cricket Stadium on Sunday evening.

ఉప్పల్ స్టేడియంలో టీవీ నటి సహా అరుగురి అరెస్ట్

Posted: 04/22/2019 12:50 PM IST
Tv actress among six arrested for nuisance at uppal stadium

ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్‌ హైదరాబాద్‌-కోల్‌కత నైట్ రైడర్స్‌ మధ్య క్రితం రోజు రాత్రి జరిగిన మ్యాచ్‌లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. తోటి ప్రేక్షకుడి పట్ల అసభ్యపదజాలంతో దూషించి.. అతను క్రికెట్ మ్యాచ్ చూడకుండా మ్యాచ్ అద్యంతం వారు న్యూసెన్స్ క్రియేట్ చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరంతా పీకల్లోతు మద్యం సేవించి స్టేడియంలోకి ప్రవేశించారని.. ఆ మత్తులోనే వారు ఏం చేస్తున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తంచారని తోటి ప్రేక్షకుడు పోలీసులకు పిర్యాదు చేశారు.

అంతేకాదు తాను మ్యాచ్ చూడటానికి వచ్చానని, తనను మ్యాచ్ చూడనీయకుండా అటంకాలు కల్పించడం సముచితం కాదని వారితో అన్నందుకు వారు తనపై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారని దాంతో పాటు తమతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించారని వారు అన్నారని ప్రేక్షకుడు పోలీసులకిచ్చిన పిర్యాదులో పేర్కోన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ స్టేడియం వేదికగా నిన్న రాత్రి హైదరాబాద్ కోల్ కత్తా మధ్య ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కొంతమంది యువతీయువకులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. మ్యాచ్ ను వీక్షించేందుకు ఆరుగురు యువతీయువకులు మద్యం తాగి వచ్చారు.

మ్యాచ్‌ జరుగుతుండగానే గ్యాలరీలో నానా హంగామా సృష్టించారు. ఇతర వీక్షకులను గేలి చేస్తూ రచ్చరచ్చ చేశారు. పూర్తిగా మైకంలో ఉన్న ఓ యువతి అసభ్యంగా ప్రవర్తించడంతో ఓ ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చశాడు. దీంతో.. పూర్ణిమ, ప్రియ, ప్రశాంతి, శ్రీకాంత్‌రెడ్డి, సురేష్, వేణుగోపాల్‌ లపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఉన్న భరత్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ ఉపాధ్యాయ(41)ను మ్యాచ్ చూడనీయకుండా అడ్డుకున్నారు. దీంతో సంతోష్ ఉప్పల్ పోలీసులకు కంప్లెయింట్ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : six arrested  uppal stadium  Tv actress  prashanthi  nuisance case  cyberabad police  Crime  

Other Articles