High alert sounded in Hyderabad, Goa and other states శ్రీలంక పేలుళ్ల నేపథ్యంలో హైదారబాద్, గోవాలో హైఅలర్ట్..

High alert sounded in hyderabad goa and other states

High alert in Hyderabad, High alert in Goa, High alert in Indian states, Sushma-Swaraj, Sri-Lankan-Tamils, Sri-Lanka-Easter-attack, sri-lanka-bomb-blasts, sri-lanka-blasts, sri-lanka-attack, Easter-blast, Blasts-in-Sri-Lanka, Thawheed Jamaat, High alert, Hyderabad, Goa, Indian states, sri lanka blasts, terror attack, Crime

High alert was sounded in the Hyderabad and Goa along with many other states following the serial blasts in hotels and churches in Sri Lanka. Soon after the news spread, bomb detection squads conducted searches in churches across the State, which continued till late in the night.

శ్రీలంక పేలుళ్ల నేపథ్యంలో హైదారబాద్, గోవాలో హైఅలర్ట్..

Posted: 04/22/2019 01:41 PM IST
High alert sounded in hyderabad goa and other states

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస పేలుళ్ల నేపథ్యంలో భారత్ లోని హైఅలర్ట్ ప్రకటించారు. మరీ ముఖ్యంగా గోవా, హైదరాబాద్‌ లలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పేలుళ్ల నేపథ్యంలో పోలీసులు, బాంబ్ స్వాడ్ బృందాలు జనసంచారం అధికంగా వున్న ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. గోవాలో ఈస్టర్ సందర్భంగా క్రైవవులు అక్కడి చర్చులకు వెళ్లడం అనావాయితి. దీంతో అక్కడి చర్చుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు గోవా పోలీసులు. ఈస్టర్ ను పురస్కరించుకుని గోవాలోని ప్రముఖ హోటళ్లకు చేరుకున్న పర్యాటకుల సురక్షణ కోసం కూడా బద్రతాచర్యలు చేపట్టారు పోలీసులు.

అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు పాల్పడిందన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు పలుచోట్ల తనిఖీలను నిర్వహించారు. గోవాలో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, జిల్లా పోలీసులు, పత్ర్యేక బలగాలను అప్రమత్తం చేశారు. విదేశీ సూరిస్ట్ ల తాకిడి ఎక్కువగా ఉండే గోవా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో ఆయా ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తీవ్రవాదులు వాహనాలు పేల్చడం..కత్తులతో దాడులు చేయవచ్చని ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేయటంతో ముంబైలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయంలో భద్రతను పెంచారు. 1000మంది పారా మిలటరీ బలగాలను గోవాలో మోహరించారు.

గోవాలో భద్రత కోసం సీఐఎస్ఎఫ్, సీఆర్ పీఎఫ్, బీఎస్ఎఫ్ లకు చెందిన ఆరువేలమంది జవాన్లను రప్పించి మోహరింపజేశారు. దీంతో గోవా రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఇక హైదరాబాద్ లో ఐసిస్ మాడ్యూల్ కేసు విచారణలో ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అనుమానితులైన దంపతులను అరెస్టు చేశారు. చాంద్రాయణ గుట్ట ప్రాంతానికి చెందిన అబ్దుల్ బాసిత్‌ అనే వ్యక్తి ఐసిస్‌లో చేరాలనే లక్ష్యంతో సిరియా, టర్కీ, ఆప్ఘనిస్థాన్‌ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గత ఏడాది పోలీసులకు చిక్కాడు.

దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు ఉగ్రవాదులు ప్లాన్‌ చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో జాతీయ దర్యాప్తు బృందం రంగంలోకి దిగి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తోంది. ఇతని ప్రయత్నాలకు ఐసిస్‌ సానుభూతి పరులు ఆర్థిక సాయం చేస్తున్నట్లు సమాచారం. దేశంలో ఏ మూలన ఉగ్రచర్యలు జరిగినా దాని మూలాలు ఏదో రూపంలో హైదరాబాద్‌లో వెలుగు చూడడమే పోలీసుల అప్రమత్తతకు కారణం. ఇక్కడ చాప కింద నీరులా ఉగ్రనీడలు విస్తరిస్తున్నాయనే అనుమానాలు బలంగా వినిపిస్తున్న క్రమంలో కుట్రలకు ఆజ్యం పోస్తున్నట్టు భావిస్తున్న పలువురు యువకులను ఎన్ఐఏ విచారిస్తోంది. తాజాగా శ్రీలంక పేలుళ్ల నేపథ్యంలో అధికారులు మరింత అలర్ట్ అయ్యారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High alert  Hyderabad  Goa  Indian states  sri lanka blasts  terror attack  Crime  

Other Articles