Death toll rises to 290 in sri lanka 290కి చేరిన శ్రీలంక మృతుల సంఖ్య.. తావీత్ జమాత్ పాత్రపై అనుమానాలు

Death toll from sri lanka attacks rises to 290 and about 500 wounded

Sushma-Swaraj, Sri-Lankan-Tamils, Sri-Lanka-Easter-attack, sri-lanka-bomb-blasts, sri-lanka-blasts, sri-lanka-attack, Easter-blast, Blasts-in-Sri-Lanka, Thawheed Jamaat, terror attack, sri lanka blasts, colombo chruch blasts, Crime

Authorities lifted a curfew in Sri Lanka on Monday, a day after a string of bombings at churches and luxury hotels across the Indian Ocean island killed 290 people and wounded about 500, but there were warnings more attacks were possible.

290కి చేరిన శ్రీలంక మృతుల సంఖ్య.. తావీత్ జమాత్ పాత్రపై అనుమానాలు

Posted: 04/22/2019 11:57 AM IST
Death toll from sri lanka attacks rises to 290 and about 500 wounded

శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 290కు చేరుకుంది. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో మొత్తం 500 మంది తీవ్రంగా గాయపడినట్టు పోలీస్ అధికార ప్రతినిధి తెలిపారు. శ్రీలంకలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడి ఎనిమది చోట్ల బాంబులు పేల్చారు. గుడ్ ఫ్రైడే తరువాత వచ్చే అదివారం రోజున క్రైస్తవులు ఈస్టర్ సండేను నిర్వహించకుంటారు. ఈ పవిత్ర రోజును పురస్కరించుకుని చర్చిల్లో ప్రార్థనలకు వచ్చే క్రైస్తవులు, విదేశీ పర్యటకులు తాకిడి ఉండే హోటల్స్ ను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడులకు తెగబఢి నరమేధానికి పాల్పడ్డారు. దశాబ్దం తర్వాత శ్రీలంకలో జరిగిన అత్యంత హింసాత్మక ఘటన ఇదే కావడం గమనార్హం.

సోమవారం ఉదయం కొలంబో విమానాశ్రయం సమీపంలో బాంబును గుర్తించిన పోలీసులు, నిర్వీర్యం చేశారు. దీంతో మరో భారీ ప్రమాదం తప్పింది. బాంబు దాడులతో శ్రీలంకలో కర్ఫూ విధించారు. జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశానికి శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పిలుపునిచ్చారు. ప్రధాని విక్రమ్‌సింఘే రణిల్ సైతం ఈ సమావేశానికి హాజరవుతున్నారు. శ్రీలంక జనాభా మొత్తం 2.14 కోట్లు కాగా, వీరిలో క్రైస్తవ మైనార్టీలు 6 శాతం. వీరినే లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఇప్పటి వరకూ బాంబు పేలుళ్ల ఘటనలో 24 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ దాడుల వెనుక విదేశీ తీవ్రవాదుల హస్తం ఉన్నట్టు శ్రీలంక ప్రభుత్వం అనుమానిస్తోంది.

మరోవైపు, కొలంబో పేలుళ్లలో 40 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోగా, వీరిలో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో మృతిచెందిన మరో ఇద్దరు భారతీయులను గుర్తించారు. ఎన్నికల ప్రచారం ముగించుకున్న ఏడుగురు జేడీఎస్ నేతలు శ్రీలంక పర్యటనకు వెళ్లారు. కాగా బాంబు పేలుళ్లు జరిగిన తరువాత అదృష్యమైన ఏడుగురు జేడీఎస్ నేతల్లో వీరు ఇద్దరని ఆ పార్టీ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. కాగా వారిని కేజీ హనుమంతరాయప్ప, ఎం రంగప్పగా గుర్తించినట్టు కొలంబోలోని భారత హైకమిషనర్ కార్యాలయం తెలిపిందని, మిగిలిన నేతల సమాచారం కోసం తాను అనునిత్యం భారత హైకమిషనర్ ను సంప్రదిస్తూనే వున్నానని అన్నారు.

ఈ నరమేధంతో ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ దాడుల వెనుక ఐసిస్ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాల్దీవుల నుంచి బంగ్లాదేశ్ వరకు వివిధ సందర్భాల్లో జరిగిన ఉగ్రదాడులతో ఐఎస్‌కు సంబంధాలు ఉండటంతో శ్రీలంకలోనూ అది విస్తరించినట్టు భావిస్తున్నారు. ఇక్కడ కూడా ఐఎస్ చేసిన ప్రయత్నం సఫలమైందని నిఘా వర్గాలు నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఇదే సమయంలో తావీత్ జమాత్ పాత్రను కూడా తక్కువ అంచనా వేయరాదని హెచ్చరిస్తున్నారు. తావీత్ జమాత్ ఉనికి ప్రస్తుతం తమిళనాడులోనూ ఉందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : terror attack  sri lanka blasts  colombo chruch blasts  Thawheed Jamaat  Crime  

Other Articles