will adopt konidela village, says pawan kalyan కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటా: పవన్ కల్యాణ్

Will adopt konidela village in kurnool says pawan kalyan

pawan kalyan adopts konidela village, pawan kalyan, Janasena, Konidela village in kurnool , YSRCP, BJP, TDP, JanaSena, Rayalaseema, chopper, janasena, Nandyal, nandikotkur, adoni, emmiganur constituencies, Andhra Pradesh, Politics

Janasena Chief Pawan Kalyan assures villagers of kurnool, he will adopt the village with the name comes of his intial after grand welcome offered by villagers

కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటా: పవన్ కల్యాణ్

Posted: 03/29/2019 09:17 PM IST
Will adopt konidela village in kurnool says pawan kalyan

రాయలసీమను కరువు సీమగా కాదు, కల్పతరువు సీమగా మార్చుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సీమలోని నాలుగు జిల్లాలను 10 ఏళ్ల పాటు కరువు జిల్లాలుగా ప్రకటించి... పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలకు 10 ఏళ్ల పాటు పన్ను రాయితీలను కల్పిస్తానని చెప్పారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకు ముందు కొణిదెల గ్రామంలో హెలికాప్టర్ లో ఆయన దిగారు. ఈ సందర్భంగా పవన్ కు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. అక్కడి రైతులు, ఆడపడుచులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన ఇంటిపైరేన ఈ ఊరికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని తెలిపారు.

జనసేన సభలో అపశృతి.. ఆటో డ్రైవర్ మృతి

కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన జనసేన సభలో అపశృతి చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ పాల్గొన్న సభకు భారీగా ప్రజలు రావడం.. అందరూ పవన్ చూడాలన్న కాంక్షతో ముందకు రావడంతో అనూహ్యరీతిలో తొక్కిసలాట జరగింది.. ఓ ఆటోడ్రైవర్ ప్రాణాలు విడిచాడు. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. మరణించిన వ్యక్తిని సిరాజ్ గా గుర్తించిన పోలీసులు అతని వయసు 30 సంవత్సరాలని నిర్థారించుకున్నారు.

పవన్ కల్యాణ్ హాజరైన ఈ సభకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చి సభస్థలికి చేరకున్నారు. ఈ సభకోసం ఏర్పాటు చేసిన స్పీకర్లకు ఉన్న ఇనుప రాడ్లు జారిపోవడంతో జనాల్లో తొక్కిసలాట ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఒకరినొకరు తొసుకోవడంతో తోక్కిసలాట జరిగింది. ఈ తోక్కిసలాటలో అటో డ్రైవర్ సిరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని నంద్యాల ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ సిరాజ్ మరణించాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  konidela village  nandyal  kurnool  Andhra Pradesh  Politics  

Other Articles