Defeat BJP, Congress & vote for TRS: KCR 16 ప్రధాని మోడీ చెప్పినవన్నీ అబద్దాలే: కేసీఆర్

State will get justice only with federal front kcr

Telangana cm on modi, kcr on PM Modi, KCR alleges modi lies, modi govt is failure in all aspects, KCR, Telangana CM, KTR, BJP, Narendra Modi, Rahul Gandhi, Congress, Telangana, politics

Telangana CM, TRS president K.Chandrashekar Rao alleged that Prime Minister Narendra Modi had told lies in Mahaboobnagar, says arogya sri is much better than Ayushman bharat.

రానున్నది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే: కేసీఆర్

Posted: 03/29/2019 08:33 PM IST
State will get justice only with federal front kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగం ఆరంభంలోనే ప్రధాని నరేంద్ర మోదీపై సూటిగా వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా సభలో మోదీ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని, ఘోరమైన మాటలని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీచేస్తే చచ్చీచెడీ ఒక్కస్థానంలో గెలిచారని, ఇవాళ వాళ్ల మాటలు వింటుంటే కళ్లు తిరిగి కిందపడాలనేట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మోదీ మాట్లాడిన మాటలు కానీ అన్నీ అసత్యాలేనని అన్నారు.

తెలంగాణలో అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ పథకం కేంద్రం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ కంటే ఎన్నో రెట్లు మెరుగైనదని చెప్పారు. తాము అందిస్తున్న పథకాలనే కాపీ కొడుతూ మోదీ తిరిగి వాటిని తమకే అందిస్తున్నారని ఆరోపించారు. మా ఆరోగ్య శ్రీ గొప్పదో, మీ ఆయుష్మాన్ భారత్ గొప్పదో తేల్చుకోవాలంటే మా జగదీశ్వర్ రెడ్డిని పంపిస్తా, దమ్ముంటే ఎవరైనా ముందుకు రావాలని కేసీఆర్ సవాల్ విసిరారు. గత ఎన్నికలలో చాయ్ వాలా పేరుతో వచ్చిన బీజేపి పార్టీ.. ఈ సారి చౌకీదార్ పేరుతో వస్తుందని మండిపడ్డారు.

తాను యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా వున్నప్పుడు 11 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని.. అయితే ఆ వివరాలను ప్రభుత్వాలు కానీ, సైనిక అధికారులు కానీ బయటికి రానీవ్వరని అన్నారు. కానీ ఇప్పడు అధికారంలో వున్న ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ నే తమ ప్రచారంగా మలుచుకుందని చెప్పారు. దేశభద్రత విషయాన్ని లేదంటే హిందుత్వాన్ని ప్రచారఅస్త్రాలుగా మలుచుకున్న పార్టీలు.. ప్రజలకు చేకూర్చుతున్న మౌళిక వసతుల కల్పనలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దేశంలో తాగునీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

"ఎందుకొచ్చిన సొల్లు ఇదంతా! అయినా ఒక్క మాట అడుగుతున్నా. నరేంద్ర మోదీ ఐదేళ్లలో ఏంచేశాడు? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏం జరిగింది? డబ్బాలో గులకరాళ్లు వేసినట్టు లొల్లి లొల్లి చేస్తారు. రైతులకు ఏమన్నా చేశారా? దళితులకు ఏమైనా చేశారా? ముస్లిం మైనారిటీలకైతే ఏమీ చేయరు" అంటూ నిప్పులు చెరిగారు. ఇక ఆయన ఒక బిసి అయివుండి కూడా బీసిలకు ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయలేకపోయారని కేసీఆర్ ధ్వజమెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Telangana CM  KTR  BJP  Narendra Modi  Rahul Gandhi  Congress  Telangana  politics  

Other Articles