UK Court denies bail to Nirav Modi, again నిరవ్ మోడీకి మరోసారి బెయిల్ తిరస్కరణ

Nirav modi s plea fails to cut ice in uk court to continue in jail

Nirav Modi, Narendra Modi, london, Nirav Modi bail, Prime Minister of India, Punjab National Bank, PNB scam, diamond merchant, UK Court, west minister court, politics

In yet another setback for fugitive diamond merchant, the UK Court again denied bail to Nirav Modi. This is for the second time that the Court has denied bail to him.

మరోసారి.. నిరవ్ మోడీ బెయిల్ తిరస్కరణ..

Posted: 03/29/2019 09:52 PM IST
Nirav modi s plea fails to cut ice in uk court to continue in jail

పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ పెట్టుకున్న బెయిల్ అప్లికేషన్ ను  శుక్రవారం(మార్చి-29,2019)లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఒకసారి నీరవ్ బెయిల్ అప్లికేషన్ ను కొట్టేసిన కోర్టు ఇవాళ మరోసారి కొట్టివేసింది.నీరవ్ కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. బెయిల్ ఇస్తే నీరవ్ పారిపోయే ప్రమాదం ఉందని వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జి తెలిపారు.ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్-26,2019కు కోర్టు వాయిదా వేసింది.

కోర్టులో వాదనల సందర్భంగా...నీరవ్ మోడీ భారత దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని భారత్ తరపున వాదనలు వినిపించిన టోబే కాడ్ మాన్  చీఫ్ జస్టిస్ కి తెలిపారు. నీరవ్ కు బెయిల్ ఇస్తే పారిపోయే అవకాశముందని,ఆధారాలను నాశనం చేస్తాడని, సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రమాదముందని టోబే కోర్టుకి తెలిపారు.ఆశిష్ లాడ్ అనే సాక్షికి నీరవ్ ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించినట్లు టోబే కోర్టుకి తెలిపారు.

పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ వెలుగులోకి వచ్చే కొన్ని రోజుల ముందే విదేశాలకు నీరవ్ మోడీ పారిపోయాడు. నీరవ్ కోసం భారత అధికారులు గాలిస్తున్న సమయంలో కొన్ని రోజుల క్రితం గెటప్ మార్చి లండన్ రోడ్లపై దర్జాగా తిరుగుతున్న నీరవ్ ని స్థానిక రిపోర్టర్ గుర్తించాడు. దీంతో నీరవ్ లండన్ ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. లండన్ లో ఓ బ్యాంకుకు వెళ్లిన నీరవ్ ని గుర్తించిన ఓ బ్యాంకు ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని నీరవ్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirav Modi  london  Nirav Modi bail  Punjab National Bank  west minister court  PNB scam  politics  

Other Articles