Vote for New Bharat, says Modi in Telangana నవభారత్ కోసం బీజేపికే ఓటు వేయాలని ప్రధాని వినతి

Vote for new bharat says pm narendra modi

2019 General elections, Lok Sabha elections 2019, 2019 polls, Narendra Modi, Telangana, KCR, Chandrababu, polavaram, TRS, BJP, Congress, Rahul Gandhi, Chowkidar, Chaiwala, mahabubnagar, kurnool, Andhra pradesh, Telangana, politics, Indian news

The time has come for the people of Telangana to decide between a ‘chowkidar’ working for people with sincerity and a family-led government mired in corruption, said Prime Minister Narendra Modi

‘‘మీ కాపాలాదారు కావాలా.. కుటుంబ పాలన కావాలా.?’’: ప్రధాని మోడీ

Posted: 03/29/2019 07:41 PM IST
Vote for new bharat says pm narendra modi

బీజేపీ దేశప్రయోజనాల కోసం అహర్నిశలు పాటుపడుతుంటే.. మరోవైపు విపక్షాలు వారి కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని ఎన్నికల తరుణంలో ఎవర్ని మీరు ఎన్నుకుంటారో మీరే విజ్ఞతతో అలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓటర్లకు కోరారు. దేశరక్షణ, మహిళల రక్షణ కోసం తాము  కృషి చేశానని మీ చౌకీదారుగా మళ్లీ మీ ఆశీర్వాదం కోరుతున్నానని మోడీ అన్నారు. మహూబూబ్ నగర్ జిల్లా అమిస్తాన్ పూర్ లో ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోడి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మీ ఆశీర్వాదంతో ఐదేళ్లు ప్రధానిగా పాలన అందించాను. దేశానికి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మీ ఆశీర్వాదం కోసం మళ్ళీ ఇక్కడకు వచ్చాను. అంతరిక్షంలో కూడా సత్తా చాటేలా మిస్సైల్ రూపోందించాం. నవభారతాన్నినిర్మించేందుకు మళ్ళీ  బీజేపీ కి ఓటు వేయండీ’’ అని కోరారు. బీజేపి పాలనకు ముందు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలతో.. ఏ ప్రాంతంలో ఎక్కడ ఏప్పుడు బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి నుంచి కేవలం కాశ్మీర్ వారకు మాత్రమే వాటిని పరిమితం చేశామని చెప్పారు. అవికూడా సద్దుమణిగిపోతాయని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, జ్యోతిష్యుడు చెప్పాడని ముందస్తు ఎన్నికలకి వెళ్లి కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుచేశారని మోడీ కేసీఆర్ ను విమర్శించారు. ఇన్నికోట్ల భారం ప్రజలపై పడుతోందని ఆయన తెలిపారు. ముందుస్తుకు వెళ్లినంత తొందరగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేక పోయారని  విమర్శించారు. ఏప్రిల్ లో అసెంబ్లీకి, పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు జరిగితే, మోడీ హవాముందు మీరు ఓడిపోతారని  జ్యోతిష్యుడు ముందే చెప్పాడని అందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని తెలిపారు.

అయితే త్వరలో టీఆర్ఎస్ కుడా ముక్కలవుతుందని మోడీ జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు ప్రజలు నిర్ణయస్తారా, జ్యోతిష్యుడు నిర్ణయిస్తాడో మీరే తేల్చుకోండని మోడీ కోరారు. స్వలాభం కోసం, కుటుంబం కోసం కేసీఆర్ పనిచేస్తున్నారని మోడీ  ఆరోపించారు. కేంద్రం పలు సంక్షేమ పధకాలు అమలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రజలకు అందకుండా చేస్తోందని అన్నారు. దేశంలో కోటి 50 లక్షల మందికి ఇళ్లు కట్టించామని, తెలంగాణా ప్రభుత్వం ఆ ఇళ్లను తీసుకోకుండా డబుల్ బెడ్ రూం ఇళ్ల పధకం ప్రవేశపెట్టి మధ్యలో ఆపేసిందని ఆరోపించారు.

టీఆర్ఎస్ రాజ్యాంగ విరుధ్దమైన చర్యలు చేపడుతోందని, స్వార్ధంతో ఎంఐఎంతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని మోడీ ఘాటుగా విమర్శించారు. సీఎం కేసీఆర్  రాజ్యాంగంలో లేని ముస్లిం రిజర్వేషన్ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నది ఎవరి కేసం అని  మోడీ ప్రశ్నించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని.. ప్రధాని పేర్కోన్నారు. మీ కాపాలాదారుడ్ని అడుగుతున్నాను.. ఏప్రిల్ 11న మీరు కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయం: కర్నూలు సభలో మోడీ

ఎక్కడైనా పథకాల అమలులో కుంభకోణాలు జరగడం సాధారణ విషయం, కానీ ఇక్కడ కుంభకోణాలు చేయడం కోసమే పథకాలు పుట్టిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఏ పథకాలైతే రాష్ట్ర అభివృద్ది కోసం రూపొందించారో వాటన్నింటిలో అవినీతి రాజ్యమేలుతోందని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం నుంచి ప్రతి పథకం కూడా అవినీతిమయం అయిందని అన్నారు. కర్నూలులో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్ష వ్యాఖ్యలతో హోరెత్తించారు.

రాష్ట్రానికి తాము కేటాయించిన నిధులకు లెక్కచెప్పమని అడిగినప్పటి నుంచి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఇచ్చిన డబ్బుకు లెక్క చెప్పమంటే చంద్రబాబు యూటర్న్ బాబుగా మారిపోయాడని విమర్శించారు. "దేశం మొత్తమ్మీద పొద్దున, సాయంత్రం కోర్టుల చుట్టూ తిరిగేవాళ్లతో జత కలిసి నన్ను ఓడించడానికి యూటర్న్ బాబు ప్రయత్నిస్తున్నారని అరోపించారు.

ఈ దేశం, ఈ రాష్ట్రం కోసం కాకుండా, వాళ్లు మాట్లాడే మాటలతో ఎక్కడో ఉన్న పాకిస్థాన్ లో హీరోలు కావాలని కోరుకుంటున్నారు. తన రాజకీయ స్వార్థం కోసం, తన అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి యూటర్న్ తీసుకున్న చంద్రబాబు అబద్ధాల కోటలు కడుతూ, అబద్ధాలతోనే బతుకుతున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి వస్తున్న పథకాలకు టీడీపీ ప్రభుత్వం వారి స్టిక్కర్లు తగిలించి ప్రజలకు అందజేస్తుందని ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  chowkidar  Chaiwala  KCR  Chandrababu  mahabubnagar  kurnool  AP  Telangana  politics  

Other Articles