Lok Sabha polls on time, says CEC Sunil Arora షెడ్యూల్డు ప్రకారమే సార్వత్రిక ఎన్నికలు: సీఈసీ

Lok sabha polls will be held on time says cec sunil arora

CEC, General Election, Lok Sabha elections 2019, poll preparation, Sunil Arora

The general elections in the country will be held on time, Chief Election Commissioner Sunil Arora said Friday, amid tensions between India and Pakistan. The CEC is in the Uttar Pradesh capital for the past two days to review poll preparations in the state.

షెడ్యూల్డు ప్రకారమే సార్వత్రిక ఎన్నికలు: సీఈసీ

Posted: 03/02/2019 12:58 PM IST
Lok sabha polls will be held on time says cec sunil arora

లోక్ సభకు జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు ఎన్నికల షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం మరోమారు స్పష్టం చేసింది. ప్రస్తుతం దాయాధి దేశం పాకిస్తాన్ ఉగ్రమూకల జమ్మూలోని పూల్వామాలో మానవబాంబు దాడికి పాల్పడి.. బీభత్సం సృష్టించని నేపథ్యంలో భారత్ వాయుసేన దళాలు పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిభిరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకోన్న ఉద్రిక్త పరిస్థితులు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలపై స్వయంగా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా స్పందించారు. దాయాధి దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోవని ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూలులో ఎటువంటి మార్పు ఉండదని, అనుకున్న ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందా? అన్న మీడియా ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.

ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రెండు రోజులుగా అరోరా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. వారిచ్చిన సమాచారాన్ని ఐటీ విభాగం నిర్ధారిస్తుందని, తేడాలుంటే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపేందుకు ఈసీ కట్టుబడి ఉందన్న అరోరా.. ఉద్వేగ, రెచ్చగొట్టే ప్రసంగాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CEC  General Election  Lok Sabha elections 2019  poll preparation  Sunil Arora  

Other Articles