"Dead" Terrorist Fired, Forces Lose 4 In Kupwara Encounter ఉగ్రవాది దొంగదెబ్బ: చనిపోయినట్టు నటించి కాల్పులు

Jammu encounter between terrorists and security forces in kupwara

Kupwara encounter, Kupwara, Jammu and Kashmir encounter, encounter in Kupwara, encounter in Kralgund village, encounter in Langate area, kupwara encounter, India, Terrorists, Srinagar, Militancy, Kupwara, J&K encounter, kupwara encounter

Four security personnel, including an officer, have died during an encounter with terrorists in J and K's Kupwara today. Sources say a terrorist, who was presumed dead, emerged from the rubble of a destroyed house and started firing which took the security personnel by surprise.

ఉగ్రవాది దొంగదెబ్బ: చనిపోయినట్టు నటించి కాల్పులు

Posted: 03/01/2019 08:24 PM IST
Jammu encounter between terrorists and security forces in kupwara

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండ్ విక్రమ్ అభినందన్ వర్థమాన్ విడుదల వేళ యావత్ దేశ ప్రజల దృష్టి ఆయనపైనే నిలిపిన నేపథ్యంలో అదే అదునుగా చేసుకున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు.. కాశ్మీర్ బీభత్సం సృష్టించాయి. కుప్వారా జిల్లా హంద్వారాలో 12 గంటలుగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. భద్రతాదళాల ఎన్‌కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు CRPF అధికారులు, ఇద్దరు పోలీసులు, మరో పౌరుడు చనిపోయారు. మొత్తం ఐదు మంది మరణించారు.

మరో 10 మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హంద్వారాలో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాశ్మీర్ లోని యాంటీ టెరరిస్టు దళాలు హంద్వారాలో తనిఖీలు చేశాయి. బాబాగుండ్ లాంగట్‌ ఉగ్రవాదులు వున్నారన్న సమాచారంతో జల్లెడ పడుతున్న భద్రతా దళాలు క్రాలగంఢ్ గ్రామంలో ఓ ఇంట్లో ముష్కరమూకలు నక్కారని తెలుసుకుని ఆ ఇంటిని చుట్టుముట్టాయి. జవాన్ల కాల్పులకు ముగ్గురు ఉగ్రవాదులు కుప్పకూలిపోయారు.

ఉగ్రవాదులందరూ మరణించారని భావించిన జవాన్లు వారి మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లాగా.. చనిపోయినట్టు నటించిన ఓ ఉగ్రవాది భారత భద్రతా బలగాలపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. ఈ కాల్పలుతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన జవాన్లు తేరుకుని ఉగ్రవాదిని కాల్చిచంపారు. ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో సీఆర్ఫీఎఫ్ అధికారి పింటూ, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలిస్ నసీర్ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు జవాన్లు మరణించారు. ఎన్ కౌంటర్ అనంతరం హంద్వారాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భద్రతా సిబ్బందే లక్ష్యంగా స్థానికులు రాళ్లు రువ్వారు. దాంతో ఆత్మరక్షణ కోసం పెల్లెట్ గన్స్‌తో కాల్పులు జరిపారు జవాన్లు. కాల్పుల్లో ఓ యువకుడు చనిపోయినట్లు తెలుస్తోంది. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కుప్వారా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదనపు బలగాలను భారీగా మోహరించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Terrorists  Srinagar  Militancy  Kupwara  J&K encounter  kupwara encounter  

Other Articles