Vijaya shanthi supports Pawan Kalyan sllegations on BJP పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సమర్థించిన విజయశాంతి

Vijaya shanthi supports pawan kalyan sllegations on bjp

VijayaShanti, Pawan Kalyan, Narendra Modi, Congress leader, Jana Sena, JanaSena, Janasena, Twitter, Wing commander (rank), Randeep Surjewala, Indian Armed Forces, Indian Armed Forces, Prime Minister of India, Abhinandan Varthaman, Social media, Politics

Telangana Senior Congress leader VijayaShanthi says she completly supports JanaSena President Pawan Kalyan allegations on BJP. She said this was told by her several months back, which was again repeated by Pawan Kalyan.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సమర్థించిన విజయశాంతి

Posted: 03/01/2019 03:21 PM IST
Vijaya shanthi supports pawan kalyan sllegations on bjp

బీజేపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాదనను తాను పూర్తిగా సమర్థిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల క్రితమే బీజేపీ నేతలు చెప్పారని అన్నారు. దీన్నిబట్టి మన దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చని పవన్ కల్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలను అమె సమర్థించారు. దేశభక్తి కేవలం వారిలో మాత్రమే ఉన్నట్టు బీజేపీ ప్రవర్తిస్తోందని... వారి కంటే 10 రెట్లు అధికంగా మనకూ ఉందని పవన్ చెప్పిన మాటలకు మద్దతు పలికారు.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ గిమ్మిక్కులు చేస్తుందని తాను ఎప్పుడో చెప్పిన విషయాన్ని పవన్ కల్యాణ్ మరోమారు చెప్పారని ఆమె అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీకి హితవు పలికారు. సరిహద్దులో మన సైనికులు శత్రుదేశంతో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే యడ్యూరప్ప వంటి బీజేపీ నేతలు దానిని రాజకీయ స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తుండడం హేయమన్నారు. ఇటువంటి వారిని చూసి దేశ ప్రజలకు హేయభావం కలుగుతుందని అన్నారు

ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన బీజేపీ జీఎస్టీ, నోట్లు రద్దు వంటి వాటితో ప్రజలను ఇబ్బందులపాల్జేసిందని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దేశ భద్రతను బీజేపీ పణంగా పెడుతోందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కంటే దేశ భద్రతే ముఖ్యమనుకోవడం వల్లే కేంద్రానికి మద్దతు ఇచ్చినట్టు విజయశాంతి పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు ఉన్న నిబద్ధత కూడా కేంద్రానికి లేకపోవడం దారుణమన్నారు. యడ్యూరప్ప వ్యాఖ్యలకు స్పందించని మోదీ.. బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశంలో మునిగి తేలడాన్ని బట్టి  వారి అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చని విజయశాంతి పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles