IAF pilot to be released tomorrow; Imran Khan అభినందన్ విడుదల ప్రకటన చేస్తూ శాంతి చర్చలకు ఇమ్రాన్ పిలుపు

Imran khan announces release of captured iaf pilot abhinandan

abhinandan handed back,abhinandan release tomorrow,abhinandan releasing tomorrow,abhinandan in india,abhinandan handed over to Red cross,when will abhinandan be released,is abhinandan back to india,abhinandan returned to india,abhinandan family pics win

ddressing Pakistan's National Assembly, Prime Minister Imran Khan has said that Pakistan to release IAF pilot, Wing Commander Abhinandan Varthaman, tomorrow as a peace gesture.

అభినందన్ విడుదల ప్రకటన చేస్తూ శాంతి చర్చలకు ఇమ్రాన్ పిలుపు

Posted: 02/28/2019 05:16 PM IST
Imran khan announces release of captured iaf pilot abhinandan

భారత ప్రభుత్వం ఒత్తిడి పాకిస్తాన్ పై బాగా పనిచేసింది. భారతీయుల ప్రార్థనలు కూడా ఫలించాయి. భారత వింగ్ కమాండ్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగిరావాలన్న దేశప్రజల వేడుకోలు భగవంతుడు కరుణించినట్లు వున్నాడు. తమ అధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్ ను విడుదల చేయబోతున్నట్టు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. శుక్రవారం ఆయన భారత్ లో క్షేమంగా అడుగుపెట్టనున్నారు. భారత్-పాకిస్థాన్ ల మధ్య శాంతి నెలకొనాలనే ఉన్నత లక్ష్యంలో భాగంగా అభినందన్ ను విడుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

పాక్ పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ ఈమేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకునే క్రమంలో భారత్ ప్రధాని మోదీతో మాట్లాడేందుకు నిన్న తాను యత్నించానని, కానీ కుదరలేదని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను... భయపడుతున్నట్టుగా అర్థం చేసుకోవద్దని అన్నారు. అభినందన్‌ను విడుదల చేయాలనే నిర్ణయాన్ని చేతకాని తనంగా చూడొద్దన్నారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.

5 నిమిషాల పుల్వామా ఘటన గురించి భారత్ మాట్లాడుతోందన్న ఇమ్రాన్ ఖాన్... 19ఏళ్ల కశ్మీర్ యువకుడు మానవ బాంబుగా ఎందుకు మారాడో ఆలోచించడం లేదని ఇమ్రాన్ అన్నారు.  కశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలకు పాకిస్థాన్ ను ఎంతకాలం నిందిస్తారని ప్రశ్నించారు. ఆధారాలు చూపకుండానే చర్యలు తీసుకోవాలని ఎలా అడుగుతారని చెప్పారు. ఆత్మాహుతి దాడులను ఇస్లామిక్ రాడికలిజం అని అంటున్నారని... హిందూమతానికి చెందిన తమిళ టైగర్లు ఇదే విధంగా దాడులు చేసేవారని గుర్తు చేశారు. మరోవైపు ఇమ్రాన్ తీసుకున్న నిర్ణయం పట్ల భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wing commander Abhinandan  Imran Khan  IAF pilot  iaf air strikes  pakistan  

Other Articles