IAF airstrike helping BJP was misinterpreted: BSY దేశమంతా.. సైన్యం ధైర్యం అంటే.. ఆయన మాత్రం సీట్లు.. గెలుపు..

Air strike will help bjp win 22 seats in karnataka bs yeddyurappa

B S Yeddyuraapa, Karnataka BJP chief, airstrike, pulwaka attack, surgical stikes, VK singh, BJP, Congress, politics

Karnataka BJP chief had said that India's pre-emptive strikes on terror camps in Pakistan had created a wave in favour of Prime Minister Narendra Modi and would help the party win 22 of 28 seats in the state in the coming Lok Sabha polls.

తన రూటు వేరని.. నిరూపించుకున్న యడ్యూరప్ప.. తోక వంకర..

Posted: 02/28/2019 04:32 PM IST
Air strike will help bjp win 22 seats in karnataka bs yeddyurappa

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాజకీయ వర్గాల్లో పెనుదుమారాన్నే రేపుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత  వైమానిక దాడుల నేపథ్యంలో యావత్ దేశమంతా దేశసైన్య పోరాటపటిమను, వీరత్వాన్ని పోడుగుతుంటే ఆయన మాత్రం ఏకంగా తన పార్టీకి కావాల్సినంత మైలేజ్ వచ్చందని.. దీంతో తాము నాలుగింట మూడోంతుల మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమాగా ప్రకటించేసుకోవడం రచ్చరేపుతొంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపి పక్షాన ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకుని ఆ తరువాత బలం నిరూపించుకోలక రాజీనామా చేసిన ఆయన అప్పట్లోనే పెను సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం దూరం కాకూడదని ఎన్నో రకాలుగా ప్రలోభాలకు గురిపెట్టారు. అయినా తమ ఆటలు సాగకపోవడంతో.. ఇంకా తెర వెనుక ప్రయత్నాలు సాగిస్తూనే వున్నాడని ఇటీవల ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఆయన అడియో టేపును మీడియా ఎదుట వినిపించాడు.

ఇంత జరిగినా ఇంకా తోక వంకర బుద్ది పోనిచ్చుకోని ఆయన.. తాజాగా పాకిస్థాన్ పై భారత వాయుసేన జరిపిన దాడుల్తో దేశం గొప్ప పనిచేసిందని, భారత్ తెగువను, వాయుసేన పోరాట పటిమను యావత్ దేశాలు కొనియాడుతుండగా, యడ్యూరప్ప మాత్రం.. ఈ దాడుల్లో తమ పార్టీ ఇమేజ్ పెరిగిపోయిందని వ్యాఖ్యలు చేసి దూమారాన్ని రేపారు. అంతటితో అగని యడ్యూరప్ప ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలో రానున్న పార్లమెంటరీ ఎన్నికలలో కర్ణాటకలో బీజేపీ 22 లోక్ సభ సీట్లు గెల్చుకునేందుకు ఉపయోగపడతాయని ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంతపార్టీ నేతలు కూడా ఆయనపై ఫైర్ అవుతున్నారు.

ఓ వైపు పాక్ చెరలో ఉన్న భారత పైలట్ క్షేమంగా తిరిగిరావాలని దేశమంతా ప్రార్థనలు చేస్తున్న సమయంలో యడ్యూరప్ప ఇలంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి దేశం మొత్తం కేంద్రప్రభుత్వానికి, మన భధ్రతా బలగాలకు మద్దతుగా నిలబడిందని, ఇటువంటి సమయంలో పాక్ తో యుద్ధం , ఉగ్రదాడి తమ పార్టీకి ఎన్ని సీట్లు తెచ్చిపెడుతుందో అనే లెక్కలేసుకోవడంలో యడ్యూరప్ప బిజీగా ఉన్నారని  కర్ణాటక సీఎం కుమారస్వామి విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం మన జవాన్ల త్యాగాలను వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు.

యడ్యూరప్ప వ్యాఖ్యలను మాజీ ఆర్మీ జనరల్, కేంద్రమంత్రి, బీజేపీ నేత వీకే సింగ్ తప్పుబట్టారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ కూడా యడ్యూరప్ప వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో సరికొత్త ప్రచారానికి తెరదీసింది. భారత్ లోని అధికార పార్టీ 22 సీట్లపై కన్నేసి ఇంతమంది ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందంటూ పీటీఐ ట్వీట్ చేసింది. యుద్ధం ఎలక్షన్ ఆప్షనా అంటూ ప్రశ్నించింది. యడ్యూరప్ప వ్యాఖ్యల వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా యడ్యూరప్ప వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవడంతో..తన మాటలను వక్రీకరించారంటూ యడ్యూరప్ప మరో ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles