PM Modi desperate only for re-election: Surjewala ప్రాధాన్యతా అంశాలను పక్కనబెట్టి.. ప్రధాని ఎన్నికల ప్రచారం

Pm modi has misplaced priorities he is desperate only for re election congress

Narendra Modi, Twitter, Wing commander (rank), Randeep Surjewala, Indian Armed Forces, Indian Armed Forces, Prime Minister of India, Abhinandan Varthaman, Social media, Politics

The Congress alleged that Prime Minister Narendra Modi has "misplaced priorities" and that he was "desperate only for re-election". It also accused the saffron party leaders of politicising the bravery of the armed forces.

ప్రాధాన్యతా అంశాలను పక్కనబెట్టి.. ప్రధాని ఎన్నికల ప్రచారం

Posted: 03/01/2019 11:18 AM IST
Pm modi has misplaced priorities he is desperate only for re election congress

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం దేశానికి సంబంధించిన ప్రాధాన్యతా అంశాలను పక్కనబెట్టి.. రానున్న సార్వత్రిక ఎన్నికలనే టార్గెట్ గా చేసుకుని వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ తీవ్రంగా తప్పబట్టింది. పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన దాడులు జరిపి వచ్చిన క్రమంలో మరుసటి రోజు ఉదయాన్నే ఆయన రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి.. యావత్ దేశం నివ్వెరపోయేలా అక్కడ ఉగ్రదాడులను అంశాన్ని కూడా ఎన్నికల ప్రచారాస్త్రాంగా మార్చుకున్నారని కాంగ్రెస్ మండిపడింది.

ఇక మరుసటి రోజున దేశ గగనతలంలోకి వచ్చిన పాకిస్థాన్ ఎఫ్-16 యుద్దవిమానాలను వెంబడించి మరీ కూల్చివేసిన తరుణంలో యావత్ దేశమంతా ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తున్న క్రమంలో ప్రధాని మాత్రం తాపీగా విద్యార్థులతో సమావేశం నిర్వహించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీఫ్ సూర్జీవాలా విమర్శించారు. ఈ క్రమంలో పాక్ చేతిలో చిక్కిన పైలెట్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని యావత్ భారతదేశం ప్రార్థనలు చేస్తుంటే, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ‘‘మేరా బూత్ సబ్ సే మజ్ బూత్’’ అంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డు సృష్టించాలని చూస్తున్నారని సూర్జేవాలా ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్య అంశాలను పక్కనబెట్టి, రాబోయే ఎన్నికలపైనే దృష్టి పెట్టారంటూ రణ్‌దీప్ ఫైర్ అయ్యారు. ‘ప్రాధాన్య అంశాలను పక్కనపెట్టేశారు. వింగ్ కమాండర్‌ అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని 132 కోట్ల మంది భారతీయులు ప్రార్థిస్తుంటే.. మోదీ మాత్రం రాబోయే ఎన్నికలపైనే  దృష్టి పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ చాలా ముఖ్యమైన  సీడబ్ల్యుసీ, ర్యాలీలను రద్దు చేసుకుంది. ప్రధాన మంత్రి మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రికార్డు కోసం ప్రయత్నించడం దురదృష్టకరం’ అంటూ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Twitter  Wing commander (rank)  Randeep Surjewala  Indian Armed Forces  Politics  

Other Articles