Rain expected in Telangana in next 48 hours రానున్న 48గంటల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం..

Rain expected in telangana in next 48 hours

Rain in Telangana, low pressure, cumulonibous clouds, afghanistan, rajasthan, rains, telanagana, IMD, weather forecast, hyderbad

Rain is likely to occur in some parts of Telangana in the next 48 hours due to a low-pressure area developed over Chattisgarh, Jharkhand and Odisha and the formation of a trough extending from Tamil Nadu to Rayalaseema, said an IMD official.

రానున్న 48గంటల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం..

Posted: 02/13/2019 12:01 PM IST
Rain expected in telangana in next 48 hours

తెలంగాణలో రేపు (గురువారం) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అనేకప్రాంతాల్లో తేలికపాటి జలుల్లు నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక క్యూములోనింబస్ (దట్టమైన కారుమబ్బులు) మేఘాలు అధికంగా వున్న ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే అకాల వర్షాలు కురవడానికి కూడా కారణాలు వున్నాయి.

ఉత్తరాదిన హిమాలయ పర్వతాల నుంచీ నిత్యం చల్లటి గాలులు వీస్తూనే ఉంటాయి. ఐతే... అప్పుడప్పుడూ రాజస్థాన్, ఆపైన ఆప్ఘనిస్థాన్ నుంచి కూడా చల్ల గాలులు వస్తుంటాయి. ఈ రెండింటిలో ఎడారి ప్రాంతాలే అధికం. మరీ ముఖ్యంగా ఆప్ఘనిస్థాన్ పూర్తిగా ఎడారి దేశం. అయితే అక్కడి నుంచి చల్లగాలులు ఎలా వీస్తాయనేగా మీ అనుమానం. అఫ్ఘనిస్తాన్ లోని ఇసుక నేలలు చల్లదనాన్ని పీల్చుకుంటాయి. అందువల్ల అక్కడి నుంచీ వచ్చే గాలులు అత్యంత చల్లగా ఉంటాయి.

అవి దక్షిణ భారత దేశాన్ని చేరుకునేదాకా చల్లదనాన్ని కోల్పోవు. ఇప్పుడు ఆ గాలులు తెలంగాణను చేరాయి. అందుకే తెలంగాణలో వాతావరణం కొద్దిగా మారింది. గాలులు బాగా వీస్తున్నాయి. ఇదే సమయంలో... బంగాళాఖాతం నుంచి కూడా చల్ల గాలులు అలా అలా వస్తున్నాయి. అవి ఛత్తీస్‌గఢ్-తెలంగాణ ప్రాంతంలో ఉత్తరాది గాలుల్ని కలుస్తున్నాయి. ఆసక్తికర విషయమేంటంటే... ఈ గాలులు వేగంగా కదులుతూ... ఆకాశంలో దట్టమైన క్యుములోనింబస్ మేఘాల్ని ఏర్పాటు చేస్తున్నాయి.

అవి కాస్త ఎక్కువగానే వానలు కురిపిస్తాయి. సాధారణంగా తెలంగాణలో వాతావరణం ఈపాటికే వేడెక్కాలి. కానీ ఇప్పటికీ రాష్ట్రంలో తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. జిల్లాల్లో ఎక్కడా కూడా 20 డిగ్రీలకు మించట్లేదు. ఇదీ మంచిదే. ఇప్పుడే వేడి వాతావరణం వచ్చేస్తే... ఇక మార్చి, ఏప్రిల్, మేలో బతకలేం. కాబట్టి... వాతావరణం ఇలా చల్లగానే ఉండాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cumulonibous clouds  afghanistan  rajasthan  rains  telanagana  IMD  weather forecast  

Other Articles