ED notices to Revanth, Uday Simha' ఓటుకు నోటు కేసు: రేవంత్ రెడ్డికి ఈడీ నోటీసులు

Cash for vote ed summons tpcc working president revanth reddy

ED notices to Revanth reddy, revanth reddy, vote for note, horse riding, vem narender reddy, enforcement directorate, chandrababu naidu, stephen son, anglo-indian MLA, MLC elections, Telanagana, Politics

Enforcement Directorate issued summons to TPCC working president A Revanth Reddy, for questioning in connection with the cash-for-vote scam. Former MLA was asked to appear before them within seven days from the receipt of the notice.

రేవంత్ రెడ్డి చుట్టూ బిగుసుకుంటున్న ఓటుకు నోటు కేసు ఉచ్చు..

Posted: 02/13/2019 11:28 AM IST
Cash for vote ed summons tpcc working president revanth reddy

తెలంగాణలో మూడేళ్ల క్రితం సంచలనం రేపిన ఓటుకు నోటు కేసును ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారలు టేకప్ చేశారు. దీంతో మూడేళ్లుగా దుమ్ముపట్టిన ఈ కేసు సరిగ్గా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి... తన కుమారులతో సహా ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు వారిని హైదరాబాదులోని కార్యాలయంలో  విచారించారు.

అయితే, విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని... వేం నరేందర్ రెడ్డి చెప్పారు. తనను, తన కుమారులను వేర్వేరుగా విచారించారని, కేసుకు సంబంధించి అధికారులు అడిగిన డ్యాక్యుమెంట్లు అన్నింటినీ అందించామని చెప్పారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించినట్టు తెలుస్తోందని చెప్పారు. ఇక, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.

దీంతో వారం రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అప్పట్లో టీడీపీ నేతగా ఉన్న వేం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు లంచం ఇవ్వజూపారన్న అభియోగంతో రేవంత్ రెడ్డిపై ఏసీబీ అధికారులు దాఖలు చేసిన అభియోగంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే కేసులో నిందితులుగా ఉన్న వేం నరేందర్ రెడ్డిని విచారించారు. తాజాగా, రేవంత్ రెడ్డికీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

ఈ కేసులో సెబాస్టియన్, టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్యలు సైతం నిందితులుగా ఉన్నారు. వేం నరేందర్‌రెడ్డిని విచారించిన ఈడీ అధికారులు.. ప్రధానంగా రేవంత్ రెడ్డి స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు విచారణ పూర్తిగా కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles