SC gives courtroom detention to ex-CBI interim chief Rao సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ కు సుప్రీంకోర్టు శిక్ష, జరిమానా.!

Cbi s nageswara rao fined for sc contempt to sit in corner of courtroom

Ranjan Gogoi, CBI interim director, Nageshwar Rao, Muzaffarpur shelter home case, Muzaffarpur, contempt of court, uttar pradesh, crime

M Nageswara Rao, the CBI’s ex-interim director who apologized to the Supreme Court for transferring a CBI officer, committed contempt of court, a bench led by Chief Justice of India Ranjan Gogoi ruled, rejecting the apology sent by two senior CBI officials.

సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ కు సుప్రీంకోర్టు శిక్ష, జరిమానా.!

Posted: 02/12/2019 09:06 PM IST
Cbi s nageswara rao fined for sc contempt to sit in corner of courtroom

సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు తీరు ఏ మాత్రం సరిగా లేదంటూ చీవాట్లు పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆయనకు అక్షింతలు వేసింది. అంతటితో ఆగకుండా ఆయనకు శిక్షను విధించింది. దీంతో పాటు ఆయనపై లక్ష రూపాయల జరిమానా విధించిన అత్యున్నత న్యాయస్థానం వారం రోజుల వ్యవధిలో జరిమానాకు న్యాయస్థానంలో చెల్లించాలని అదేశించింది. కోర్టు అనుమతి లేకుండా సీబీఐ అధికారులను బదిలీ చేయడం ఆక్షేపణీయమని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

 తాను తాత్కాలిక డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వేళ, ఎవరినీ బదిలీ చేయరాదని, విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని స్వయంగా తాము హెచ్చరించినా, ఆయన పెడచెవిన పెట్టారని గుర్తు చేసింది. ముజఫర్ పూర్ స్టేట్ హోమ్ కేసులో విచారణ జరుపుతున్న అధికారిని బదిలీ చేయడానికి సహేతుకమైన కారణాన్ని ఆయన వివరించలేదని, బదిలీలు వద్దన్నా చేపట్టడం కోర్టు ధిక్కరణేనని పేర్కొంటూ, ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేస్తున్నట్టు వెల్లడించింది. కోర్టు సమయం ముగిసేంత వరకూ ఆయన చీఫ్ జస్టిస్ గదిలోనే ఉండాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles