stand vindicated, says Mamata సుప్రీం తీర్పుపై దీదీ హర్షం.. ప్రజావిజయమని వ్యాఖ్య

Can t arrest kolkata police chief sc tells cbi

mamata banerjee news, sc on rajeev kumar, sc cbi, mamata banerjee dharna, sc kolkata police chief, mamata banerjee dharna in kolkata, cbi director, 2019 cbi director news, cbi director news today, cbi kolkata police, cbi kolkata police face off, rishi kumar shukla, rishi kumar shukla, cbi, cbi kolkata, kolkata police commissioner rajeev kumar

The Mamata Banerjee government in West Bengal got a major relief from the Supreme Court as the top court restrained the CBI from taking coercive steps against Kolkata Police Commissioner Rajeev Kumar, including arresting him.

బెంగాల్ సర్కార్ కు ఊరట.. విచారణకు హాజరుకావాల్సిందే..

Posted: 02/05/2019 12:10 PM IST
Can t arrest kolkata police chief sc tells cbi

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించింది. కోల్ కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో ఆయనను అదుపులోకి తీసుకోవద్దని అదేశించింది. ఇవాళ ఇరు పక్షాల వాదన విన్న తరవాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. షిల్లాంగ్ లోనే రాజీవ్ కుమార్ ను సీబీఐ అధికారులు విచారించాలని పేర్కొన్నింది.

కాగా, శారదా కుంభకోణం కేసులో సీబిఐ అభియోగాలు మోపినంతనే ఆయన నేరస్థుడు కాడని, దీంతో రాజీవ్‌ కుమార్ ను అరెస్ట్‌ చేయొద్దని ఆయన సర్వోన్నత న్యాయస్థానం సిబీఐ అధికారులను అదేశించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, డీజీపీ, రాజీవ్‌ కుమార్ లకు కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్న న్యాయస్థానం.. తమ నోటీసులకు ఈ త్రయం ఫిబ్రవరి 18లోగా సమాధానాలు చెప్పాలని సూచించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీన వాయిదా వేసింది.

అంతకుమునుపు సీబీఐ తరఫు అటార్ని జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. అత్యంత కీలక సాక్ష్యాలను రాజీవ్‌ కుమార్‌ నిందితులకు అందజేశారని ఆరోపించారు. కీలక సాక్ష్యాలను సిట్ సాయంతో స్థానిక అధికారులు ధ్వంసం చేశారని ఆరోపించారు. తరవాత పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ అలాయర్‌ అభిషేక్‌ మను సింఘ్వి వాదిస్తూ... ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ లేదని.. మరి సాక్ష్యాలను రాజీవ్ కుమార్‌ ఎలా ధ్వంసం చేశారని ప్రశ్నిస్తూ సిబిఐవి పసలేని వాదనలని వాదించారు.

సీబీఐ అధికారులను రాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేయలేదని.. వీడియోను కోర్టుకు సమర్పించారు. రాజకీయ కక్షతో ఎన్నికల ముందు సీబీఐని చెక్కుచేతల్లో పెట్టుకుని కేంద్రం నాటకాలు అడిస్తూ.. బెదిరిస్తోందని అన్నారు. కాగా కోలకతా సిటీ కమిషనర్‌ రాజీవ్‌ కపూర్.. శారదా స్కాంకు సంబంధించిన కాల్‌ డేటా రికార్డులను తారుమారు చేశారని సిబీఐ అభియోగాలను మోపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసును విచారణ చేస్తోంది. సీబీఐ తరఫున అటార్నీ జనరల్‌ వేణుగాపాల్‌ వాదనలు వినిపించారు.

సీబీఐ తీర్పు పట్ల దీదీ హర్షం

కాగా, సుప్రీంకోర్టు తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. సుప్రీం తీర్పును ప్రజా విజయంగా అమె అభివర్ణించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి అమె ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు అధికారుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిందని అన్నారు.  సీబీఐ దర్యాప్తును తామెప్పుడూ అడ్డుకోలేదన్న మమత.. సీబీఐ వ్యవహరించిన తీరుపైనే అభ్యంతరం వ్యక్తం చేశామని చెప్పారు.

రాజీవ్ కుమార్ ను అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు సూచించడాన్ని అమె మరోమారు సీబిఐ అధికారులకు గుర్తు చేశారు. రాష్ట్రాల అధికార యంత్రాంగాన్ని కేంద్ర సంస్థలు గౌరవించాలని మమత అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోకూడదని అన్నారు. కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని ఇవాళ సుప్రీం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన సీబిఐ విచారణకు సహకరిస్తారని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Rajeev Kumar  Kolkata Police commissioner  mamata banerjee  saradha scam  

Other Articles