No threat to government: Kumaraswamy ‘‘మాది అలా ప్రలోభ బడ్జెట్ కాదు.. ప్రజామోద బడ్జెట్’’: సీఎం

Will give a balanced budget for all sections says hd kumaraswamy

Chief Minister H.D. Kumaraswamy, Loan waiver, budget, Vidhana Soudha, Bengaluru, Karnataka

Chief Minister H.D. Kumaraswamy, who will present his second budget here on Friday, promised to strike a balance between populist schemes and bringing about structural changes in various sectors.

‘‘మాది అలా ప్రలోభ బడ్జెట్ కాదు.. ప్రజామోద బడ్జెట్’’: సీఎం

Posted: 02/05/2019 01:21 PM IST
Will give a balanced budget for all sections says hd kumaraswamy

ఎన్నికల ముందు ప్రజలను, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను, రైతులను ప్రలోభాలకు గురిచేసేలా బడ్జెట్ వుందని ఇప్పటికే పలు జాతీయ పార్టీల నేతల విమర్శలను ఎదుర్కోన్న కేంద్ర బడ్జెట్ పై తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రలోభాల బడ్జెట్ గా తమ బడ్జెట్ వుండబోదని, తమది ప్రజామోద బడ్జెట్ అంటూ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లుగా ప్రజల సంక్షేమం పట్టని కేంద్రం ఎన్నికల ముందు మాత్రం వారిని ప్రలోభాలలో ముంచెత్తడానికి బడ్జెట్ ను తయారు చేసిందని దుయ్యబట్టారు.

బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ.. తమ బడ్జెట్‌లో ఎటువంటి ప్రలోభాలు ఉండవని, కేంద్ర బడ్జెట్ లా మాయాజాలం చేయబోనని పేర్కొన్నారు. తమ బడ్జెట్ లో ప్రలోబాలకు బదులు అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే విధంగా వుంటుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలతో తాను భేటీ అయ్యి వారి సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు. ఇక ఇదే క్రమంలో తన ప్రభుత్వాన్ని అస్థిరపర్చే పనిలో పూర్తిగా నిమగ్నమైన కొందరు కాషాయ పార్టీ నేతలను టార్గెట్ చేసిన ఆయన ‘ఆపరేషన్ లోటస్’ను బీజేపీ నేతలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చనని అన్నారు.

ఈ పనిలో నిమగ్నమైన కమలం పార్టీ నేతలకు తన నుంచి ఎటువంటి అడ్డంకి ఉండబోదన్నారు. ఎవరి ఇష్టం ప్రకారం వారు ప్రయత్నాలు చేసుకోవచ్చనని సెటైర్లు వేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి దేశ ప్రజలు ఎంతో నిరాశకు గురయ్యారన్న కుమారస్వామి ఆ పరిస్థితి రాష్ట్ర ప్రజలకు రానివ్వబోనన్నారు. విదేశాల్లోని నల్లధనాన్ని దేశానికి తీసుకొస్తానన్న మోదీ సాధించింది శూన్యమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వందల కోట్ల రూపాయల ఆశ చూపి కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. అంత డబ్బు వారికి ఎక్కడి నుంచి వస్తోందని కుమారస్వామి ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chief Minister H.D. Kumaraswamy  Loan waiver  budget  Vidhana Soudha  Bengaluru  Karnataka  

Other Articles