Kerala Government takes a big U-Turn శబరిమలలోకి ప్రవేశించిన మహిళలు ఇద్దరే: కేరళ సర్కార్..

Not 51 only 2 women entered sabarimala kerala govt

Sabarimala, temple, women, entry, list, 50 women, 2 women, ayyappa swamy, Bindhu, Kanaka Durga, Perinthalmanna shelter home, Sabarimala, Kerala government, supreme court, politics

The Kerala government has finally admitted that their guesstimate of the number of women between ages 10 and 50 who had entered Sabarimala was way off the mark.

శబరిమలలోకి ప్రవేశించిన మహిళలు ఇద్దరే: కేరళ సర్కార్..

Posted: 02/05/2019 11:21 AM IST
Not 51 only 2 women entered sabarimala kerala govt

సార్వత్రిక ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో అటు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం.. ఇటు రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వం చర్యలతో కేరళలో ప్రకృతి బీభత్సం సృష్టించిన వర్షాలు, వరదల అంశం.. అందుకు కేంద్రం చేస్తానన్న సాయం.. ఇప్పటి వరకు అందించన నిధులు.. ఆప్తులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు.. ఈ విషయాన్ని మొత్తానికి పక్కదారి పట్టించి రాజకీయ లబ్దికోసం శబరిమల దేవాలయంలోని అయప్పస్వామిని కూడా వదలకుండా రాజకీయాలు చేయడం మలయాళీ మేధావులను కలవరానికి గురిచేస్తుంది.

వందేళ్లలో ఎన్నడూ చూడని ప్రకృతి బీభత్సం తాము చూశామని, చెప్పుకోచ్చిన స్థానికులు.. ఈ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం ద్వారా ఇళ్లేూ కూలి సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఎలాంటి సాయం అందించాలన్న అంశాన్ని పక్కదారి పట్టించి.. కేవలం రాజకీయ స్వార్థం కోసం శబరిమల అయ్యప్ప స్వామిని. ఆలయ ఆచారాలను సాకుగా చేసుకుని అక్కడి పార్టీలు రాజకీయ డ్రామాలకు తెరతీసాయని మేధావులు, రాజకీయ విశ్లేషకులు అరోపిస్తూనే వున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని అన్ని పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తూనే వున్నాయి. మరీ ముఖ్యంగా కేరళలోని వామపక్ష ఎల్డీఎఫ్ ప్రభుత్వం.. శబరిమల ఆలయంలోకి ఇద్దరు కాదు ఏకంగా 51 మంది మహిళలు ప్రవేశించి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారని గతంలో దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో తాజాగా కేరళ సర్కార్ యూ-టర్న్ తీసుకుంది.

ఆలయంలోకి 51 మంది మహిళలు వెళ్లినట్టు తామిచ్చిన అఫిడవిట్ సరికాదని తేలిందని, ఇప్పటివరకూ ఇద్దరు నిషిద్ద వయస్సు మహిళలు మాత్రమే అయ్యప్పను దర్శించుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని తాజాగా పేర్కొంది. మకరవిళక్కు సమయంలో జనవరి 1న బిందు అమ్మణ్ణి, కనకదుర్గలు అనే ఇద్దరు నిషిద్ద వయస్సు మహిళలు పోలీసుల ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. కాగా, వీరి దర్శనంతో అపవిత్రమైన ఆలయాన్ని మూసివేసిన అర్చకులు సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాల అనంతరం ఆలయాన్ని తెరచి భక్తులను దర్శనానికి అనుమతించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles