Police released suspect photo in crown missing case గోవిందరాజస్వామి కిరీటాలు అపహరించింది ఇతనేనా..!

Police released photo of suspect in govindaraja swamy crown missing case

Tirupati, Tirumala, TTD, Govindaraja Swamy Temple, Devasthanams, diamonds studded crowns, three crowns, CCTV footage, security personnel, Andhra Pradesh, Politics

After three precious jewellery items including three crowns adorned by the processianl deities at the Govindaraja swamy temple gone missing, Tirumala police examined and released the suspected photos.

గోవిందరాజస్వామి కిరీటాలు అపహరించింది ఇతనేనా..!

Posted: 02/05/2019 10:21 AM IST
Police released photo of suspect in govindaraja swamy crown missing case

ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన కొండపై దేవదేవుళ్లకు అలంకరించిన మూడు వజ్రఖచ్చిత కిరీటాలు అదృశ్యమైన వార్త పెను సంచలనానికి దారితీసిన విషయం తెలిసిందే. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలోని కిరీటాలను దొంగిలించారన్న వార్త.. కలకలం రేపింది. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ముక్కు పుడుక పోయిందన్న వార్తను గుర్తుచేసింది. అయితే అప్పటికన్నా ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులో వున్న ఈ తరుణంలో కిరీటాలు దొంగలించారంటే అది దొంగల గోప్పతనం కాదని.. ముమ్మాటికీ అది అధికారుల నిర్లక్ష్యమేనని భక్తులు అరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో విమర్శలు ఎదుర్కోంటున్న పోలీసు అధికారులు ఆలయ సిబ్బందిని, పూజారులను ప్రశ్నించిన తరువాత సిసిటీవీ ఫూటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో వారు దొంగలు ఎవరన్న విషయాన్ని నిర్ధారించుకున్న తరువాత అనుమానితులుగా బావిస్తున్న వ్యక్తి ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. భక్తుల ముసుగులో వచ్చిన దొంగలే వాటిని ఎత్తుకెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు. అర్చకులు లేని సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు చాకచక్యంగా కిరీటాలను దోచుకెళ్లినట్టు పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారుల గుర్తించారు.

తిరుపతిలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన వ్యక్తితోపాటు ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో అనుమానితుడి ఫొటోను తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ విడుదల చేశారు. చోరీ జరిగిన రోజున ఆలయ పరిసర ప్రాంతాల్లోని సెల్ టవర్ ఆధారంగా కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా ఈ కేసులో మరెవరైనా నిందితులు వున్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు పోలీసు బృందాలు వెళ్లాయి. ఆలయంలోని సీసీ కెమెరా కొన్ని రోజులుగా ఎందుకు పనిచేయడం లేదన్న విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tirupati  Tirumala  TTD  Govindaraja Swamy Temple  Devasthanams  crowns  Andhra Pradesh  Politics  

Other Articles