vijayashanti on Vundavalli all party meet ఏపీ రాజకీయ పక్షాలపై విజయశాంతి అసహనం.

Vijayashanti on vundavalli arum kumar all party meet

Vijayashanti, Vundavalli Arun Kumar, all party meet, Chandrababu Naidu, Congress, Jagan, KCR, Pawan Kalyan, YSR Congress, BJP

Congress party’s star campaigner and former MP Vijayashanti said the main objective of Vundavalli Arun Kumar all party meet should conclude on supporting congress at centre, as it promised to give special status to Andhra Pradesh.

హోదా ఇస్తామన్న పార్టీకి మద్దతు పలకరా: విజయశాంతి

Posted: 01/29/2019 04:01 PM IST
Vijayashanti on vundavalli arum kumar all party meet

ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీల తీరుపై తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని హామి ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ముందుకు రాకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. రాష్ట్రంలోని పార్టీలకు తమ రాజకీయ లబ్దే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలను రాజకీయ పక్షాలు కాంక్షిస్తే.. హోదాపైనే తొలి సంతకం చేస్తానన్న రాహుల్ పిలుపు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ మద్దతు లేకుండా ప్రత్యేక హోదా ఎలా సాధిస్తారో అంతుబట్టడం లేదని విజయశాంతి ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడంతో పాటు అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ తీర్మాణం చేయడం మేలు అన్నది తన అభిప్రాయమని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందని భావించి, కాంగ్రెస్ కు మద్దతు పలికి, అనుకున్న లక్ష్యం నెరవేరిన వెంటనే కాంగ్రెస్ పార్టీ లో చేరిన వ్యక్తిగా తాను ఈ ప్రతిపాదన చేస్తున్నానని విజయశాంతి వెల్లడించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా గడచిన నాలుగున్నర ఏళ్ళ పాటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కాలయాపన చేసిందని విజయశాంతి ఆరోపించారు. ఏపీలో తమకు ఉనికి లేదనే నిర్ణయానికి వచ్చిన బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజయశాంతి కోరారు.

ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై కేంద్రంపై ఏ రకంగా పోరాడాలనే అంశంపై బుధవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో విజయశాంతి ఈ రకమైన కామెంట్స్ చేశారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చిన ఏపీ బంద్‌కు టీడీపీ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles