Kauravas born of test tube baby technology: Andhra University VC కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలే: ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ

Kauravas of mahabharata were test tube babies andhra university head

Kauravas, test tube baby, stem cell technology, Andhra University VC, Andhra University, Andhra University Vice-Chancellor, G Nageshwar Rao, Ramayana, Pushpak Viman, guided missiles, aircraft

Kauravas were born due to stem cell and test tube technologies and India possessed this knowledge thousands of years ago, claimed Andhra University Vice-Chancellor G Nageshwar Rao at the Indian Science Congress

ITEMVIDEOS: కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలే: ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ

Posted: 01/05/2019 12:28 PM IST
Kauravas of mahabharata were test tube babies andhra university head

భారతదేశంలో వేలాది సంవత్సరాల క్రితమే శాస్త్రసాంకేతిక రంగంలో పరఢవిల్లిందని ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ జి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ విషయాలను మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. గైడెడ్ మిస్సైల్ టెక్నాలజీతో పాటు టెస్ట్ ట్యూబ్ బేబి టెక్నాలజీ, స్టెమ్ సెల్ టెక్నాలజీలు కూడా పురాణకాలంలో వున్నట్లు రామాయణ, మహాభారతాలు వెల్లడిస్తున్నాయని అన్నారు.

శత్రువులను సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని వదిలేవారనీ, అది లక్ష్యాన్ని ఛేదించాక వెనక్కు తిరిగివచ్చేదని వెల్లడించారు. దీనిని బట్టి భారత్ కు గైడెడ్ మిస్సైల్ టెక్నాలజీ కొత్తకాదని అర్థమవుతుందన్నారు. అంతేకాదు రాముడు వదిలే రామబాణాలు, మహాభారత యుద్దంలో కౌరవ, పాండవులకు మధ్య జరిగిన యుద్దంలోనూ వారు వాడిన అస్త్రశస్త్రాలన్నీ కూడా మిస్సైల్ టెక్నాలజీతో కూడినవేనని ఆయన అన్నారు.

పంజాబ్ లోని జలంధర్ లో జరుగుతున్న 106వ సైన్స్ కాంగ్రెస్ లో ఆయన ప్రసంగిస్తూ.. కౌరవుల తల్లి గాంధారి గురించి ప్రస్తావించారు. 100 అండాలను వంద కుండల్లో పెట్టి ఫలదీకరించిన తర్వాతే కౌరవులు పుట్టారని తెలిపారు. వారంతా టెస్ట్ ట్యూబ్ బేబీలేనని స్పష్టం చేశారు. ఇక రావణాసురుడు సీతాదేవిని అడవి నుంచి తీసుకెళ్లిన పుష్పక విమానంతో ఆ కాలంలోనే విమానాల సాంకేతికత మన దేశంలో అందుబాటులో వుందని నాగేశ్వర రావు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles