ISRO GSAT-7A launched sucessfully విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-7ఎ

Isro launched military communication satellite gsat 7a sucessfully

ISRO, GSAT-7A, GSLV-F-11, Indian Air Force, military communication satellite, Satish Dhawan space center, sriharikota

ISRO's GSLV-F-11/GSAT-7A was launched from the Satish Dhawan Space Centre at Sriharikota in Andhra Pradesh while the GSLV-F-11/GSAT-7A mission from ISRO will help the Indian Air Force (IAF).

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-7ఎ

Posted: 12/19/2018 06:02 PM IST
Isro launched military communication satellite gsat 7a sucessfully

భారత వాయుసేన అవసరాల కోసం రూపొందించిన జీశాట్-7ఎ విజయవంతంగా నిర్ధేశిత కక్షలోకి చేర్చింది జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11 వాహకనౌక జీశాట్-7ఎను నిర్ణీత కౌంట్ డౌన్ తరువాత సరిగ్గా ఇవాళ సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. 2,250 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని కేవలం 30 నిమిషాల్లో జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 వాహననౌక 36 వేల కిలోమీటర్ల దూరంలోని నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది.

జీశాట్-7ఏ మన దేశం పంపిస్తున్న35వ సమాచార ఉపగ్రహం. దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన జీశాట్- 7ఏ ఎనిమిదేళ్లపాటు సేవలందించనుంది. భారత వాయుసేన అవసరాల కోసం దీనిని వినియోగించనున్నారు. నెల రోజుల పరీక్షల తరువాత జీశాట్-7ఏ భారత వాయుసేన అవసరాలకు అందుబాటులోకి వస్తుంది. ఇది మరీ ముఖ్యంగా మానవరహిత యుద్దవిమానాలను నడపడంలో దోహదపడుతుందని, లక్ష్య చేధనను కూడా సాధిస్తుంది.

జీశాట్-7ఏ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ఇస్రో చైర్మన్ శివన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీహరికోట నుంచి 35 రోజుల వ్యవధిలో మూడో ప్రయోగం నిర్వహించామని అన్నారు. కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్ వీ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉపగ్రహంలో అధునాతన సాంకేతికత ఉపయోగించామని చెప్పారు.

వారం రోజుల క్రితం వాతావరణ పరిస్థితులు సరిగా లేవని, మెట్ బృందం సమన్వయంతో ఈ ప్రయోగం విజయవంతమైందని అన్నారు. కాగా, జీశాట్-7ఏ ఉపగ్రహం ద్వారా భారత వాయుసేనకు 70 శాతం, సైన్యానికి 30 శాతం ఉపయుక్తం కానుంది. జీశాట్-ఏతో వైమానిక దళ కమాండ్ సెంటర్లకు కొత్త జవసత్వాలు వచ్చినట్టయింది. కేయూ బ్యాండ్ ద్వారా రాడార్ల కంటే శక్తిమంతమైన సిగ్నళ్లను జీశాట్-7 ఏ అందించనుంది. ప్రధానంగా విమానాలకు ఈ సిగ్నల్స్ ఉపకరించనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles