Making Aadhaar mandatory is offence ఆధార్ అడిగితే నేరమే.. కోటి పరిహారం.. జైలు శిక్ష

Companies violating aadhaar card norms may soon be fined by uidai

aadhar link, Aadhaar card, Telecom Companies, Bank account, individual identity, paments bank, paytm, phone pay, gpay, UIDAI, crime

UIDAI is proposed to assume a regulatory role with enhanced power to take enforcement actions on misuse of the national biometric ID and impose stiff penalties for violations

ఆధార్ అడిగితే నేరమే.. కోటి పరిహారం.. జైలు శిక్ష

Posted: 12/19/2018 04:41 PM IST
Companies violating aadhaar card norms may soon be fined by uidai

ఆధార్ కార్డు తప్పనిసరి అని అడిగేతే ఇకపై నేరమే. తప్పనిసరిగా అధార్ మాత్రమే కావాలని బలవంతం చేసే సంస్థలు, కంపెనీలకు కోటి రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు.. అందుకు బాధ్యులైన సిబ్బందికి జైలు శిక్ష కూడా పడుతుంది. ఈ శిక్షాకాలం మూడు నుంచి ఐదేళ్ల వరకు ఉండనుంది. తాజాగా ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సవరించింది. సవరించిన నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం అమోదం కూడా తెలిపింది. దీంతో ఇక పార్లమెంటులో ఈ సవరణలను అమోదించాల్సి వుంది.

పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందిన వెంటనే కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కాగా వినియోగదారులు కావాలంటే తమ ఆధార్ గుర్తింపును కూడా కేవైసీ ప్రక్రియ కోసం ఉపయోగించుకునేలా సవరణలు చేశారు. ఆధార్ పై సుప్రీంకోర్టు తీర్పు మేరకు భారత టెటీగ్రాఫ్, పీఎంఎల్ఏ చట్టాలకు కేంద్రం సవరణలు చేసింది. ప్రభుత్వ నిధులతో అందించే సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆధార్ కార్డులు వ్యక్తిగత గుర్తింపుగా పరిగణించి.. దానిని పౌరుల స్వేచ్ఛాహక్కుగా పేర్కోన్న విషయం తెలిసిందే.

ఈ తీర్పు నేపథ్యంలో కేంద్రం తాజా సవరణలను పార్లమెంటు ముందుకు తీసుకువచ్చింది. మొబైల్ కనెక్షన్, బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వినియోగదారులు ఇతర గుర్తింపు కార్డులను సమర్పించేలా సవరించింది. కాగా తమ రాష్ట్రాల్లో ఆధార్ ను తప్పనిసరి చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. అయితే రాష్ట్రాలు కూడా సుప్రీం తీర్పునకు అనుగుణంగానే వ్యవహరించాలని సూచించింది. ఇకపై వినియోగదారుడి అనుమతి లేకుండా ఆధార్ ధ్రువీకరణ కోసం వివరాలు సేకరిస్తే రూ.10 వేల నుంచి కోటి వరకు జరిమానతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. క్యూఆర్ కోడ్స్ ద్వారా చేసే ఆఫ్‌లైన్ వెరిఫికేషన్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles