Giddaluru Janasena Candidate Chandrasekhar Yadav? జనసేనలోకి కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ యాదవ్.?

Giddaluru congress leader chandrasekhar yadav to join janasena

pawan kalyan, janasena, Pawan Kalyan congress Leader, Pawan Kalyan Chandrashekar, Pawan kalyan giddalur, Pawan Kalyan ongole, pawan kalyan janasena chandrashekar, janasena chandrashekar, businessman chandrashekar, andhra pradesh, politics

Businessman and Congress leader in Prakasam district Chandrasekhar Yadav, has recently met Pawan Kalyan before his Dallas visit. Chandrasekhar is likely to join Janasena and he is going to play a crucial role in Prakasam district.

జనసేనలోకి కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ యాదవ్.?

Posted: 12/19/2018 07:17 PM IST
Giddaluru congress leader chandrasekhar yadav to join janasena

రాజకీయంగా గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్‌ యాదవ్‌ జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఆ మేరకు పార్టీ నాయకులతో పాటు పవన్‌ కళ్యాణ్‌ని కూడా కలిసి ఆయన మాట్లాడారు. ఒంగోలు నగరం త్రోవగుంట ప్రాంతంలో ఉన్న తన కార్యాలయాన్ని కూడా జనసేన జిల్లా ఆఫీసు నిర్వహణకు ఆయన సిద్ధం చేస్తున్నారు. ఒంగోలులో వ్యాపారవేత్తగా ఉన్న చంద్రశేఖర్‌యాదవ్‌ రాజకీయంగా గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఆయన త్వరలో జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డికి అత్యంత సన్నిహితుడు. 2009 ఎన్నికలలో గిద్దలూరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి అప్పటి ప్రజారాజ్యం అభ్యర్థిపై ఓడిపోయారు. అప్పటి నుంచి గిద్దలూరు నియోజకవర్గంపైనే రాజకీయంగా దృష్టిసారించారు. గిద్దలూరులోనే స్థిరపడే ఉద్దేశంతో స్వంత గృహాన్ని కూడా నిర్మించుకుంటున్నారు.
 
వచ్చే ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్న ఆయనను జనసేనకు చెందిన కొందరు ముఖ్య నాయకులు సంప్రదించారు. గిద్దలూరులో అటు కాపు సామాజికవర్గంతో పాటు ఇటు యాదవ సామాజికవర్గం ఓటర్లు కూడా గణ నీయంగా ఉన్నారు. దీంతో యాదవ సామాజికవర్గం అభ్యర్థిని రంగంలోకి దించాలన్న ఆలోచనతో ఆ పార్టీ నాయకులు చంద్రశేఖర్‌తో మూడు నాలుగు నెలలుగా టచ్‌లో ఉన్నారు.

ఇటీవల జనసేనలోనే చేరేందుకు సిద్ధమైన చంద్రశేఖర్ యాదవ్‌ ముఖ్య నాయకులందరితో కలిసి చర్చించినట్లు తెలిసింది. పవన్‌కళ్యాణ్‌ అమెరికా పర్యటనకు వెళ్లబోయే ముందు చంద్రశేఖర్‌ ఆయనను కలిసినట్లు తెలిసింది. తదనంతరం పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకుని సన్నద్ధమవుతున్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో మిగిలిన ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు.
 
ఒంగోలులో జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటులో భాగంగా త్రోవగుంట ప్రాంతంలో ఉన్న ఆయన భవనాన్ని ఎంపిక చేశారు. ఆ భవనాన్ని ఇచ్చేందుకు సిద్ధమైన చంద్రశేఖర్‌ మంగళవారం అవసరమైన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది. తదనుగుణంగా త్వరలో ఆ భవనంలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలని కూడా జనసేన నాయకులు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. కాగా నేడో రేపో అమెరికా నుంచి పవన్‌ కళ్యాణ్‌ వచ్చిన తర్వాత మరోసారి ఆయనతో మాట్లాడి ఆయన సమక్షంలోనే పార్టీలో చేరేందుకు చంద్రశేఖర్‌ యాదవ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  chandrashekar  ongole  giddaluru  andhra pradesh  politics  

Other Articles