Ramdas Athawale self goal: Rs 15-lakh will come slowly రూ.15 లక్షలు హామీ అమలుపై కేంద్రమంత్రి సెల్ప్ గోల్..

Minister ramdas athawale s rs 15 lakh self goal it will come slowly

union minister ramdas athavale, Ramdas Athawale, modi election promise, Rs 15 lakh in bank accounts, political experts, economic experts. national politics

Ramdas Athawale's statement that people will get Rs 15 lakh each in their bank accounts “slowly” has got the attention of the political as well as economic experts.

రూ.15 లక్షలు హామీ అమలుపై కేంద్రమంత్రి సెల్ప్ గోల్..

Posted: 12/19/2018 03:58 PM IST
Minister ramdas athawale s rs 15 lakh self goal it will come slowly

‘‘అధికారంలోకి వస్తే విదేశాల్లో మూల్గుతున్న నల్లధనాన్ని కేవలం మూడు మాసాల్లో వెనక్కి తీసుకొచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం..’’ 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు అప్పటి బీజేపి ప్రధాని అభ్యర్థి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ దేశప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీ. ఈ హామీ ఏమైందంటూ అప్పటి నుంచే దేశంలోని ప్రతిపక్షాలు ప్రధాని మోదీ, బీజేపీలను తరచూ నిలదీస్తూనే ఉన్నాయి. తాజాగా కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే ప్రధాని హామీపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ విశ్లేషకులను, అర్థిక నిపుణులను ఉలిక్కిపడేలా చేశాయి.

కేంద్రమంత్రి ప్రధాని హామిపై పూర్తి భిన్నంగా స్పందించి పప్పులో కాలేశారని అందరూ అనుకుంటున్నా.. అసలు రానున్న సార్వత్రిక ఎన్నికలలో గెలిచేందుకు ప్రధాని తన వద్దనున్న రామభాణం ఇదేనా అన్న సందేహం మాత్రం రేకెత్తుతుంది. మహారాష్ట్రలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు’’ ఒకేసారి రావనీ.. కొద్దికొద్దిగా వస్తాయని  పేర్కొన్నారు. ‘‘15 లక్షల రూపాయలు ఒకేసారి రావు, నెమ్మదిగా వస్తాయి. ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేవు. ఆర్బీఐని డబ్బులు అడిగినా వాళ్లు ఇవ్వడం లేదు. అందువల్ల డబ్బులు సమీకరించడం కుదరదు. హామీ అయితే ఇచ్చాంగానీ దానికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి...’’ అంటూ చెప్పుకొచ్చారు.
 
2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ సామాన్యుడి ఆశలకు రెక్కలు తొడగారు. దీంతో మోదీని అమాంతం ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన ఈ హామీ నీటి మీద రాతేనని నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు తెలిసిపోయింది. ఇక ఇప్పుడు ప్రతిపక్షాలు ఇదే అస్త్రంగా మోదీ, బీజేపీలను నిప్పుల మీద నిలబెట్టేందుకు సిద్ధమయ్యాయి. అయితే అథవాలే చేసిన వ్యాఖ్యలపై రాజకీయ ప్రముఖులు మరోకోణంలో అలోచిస్తున్నారు. ప్రధాని మోడీ సామాన్యుల అకౌంట్లతో కొద్దిగా డబ్బులు వేసేందుకు రెడీ అవుతున్నారా.? అన్న సందేహాటు కూడా వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramdas Athawale  modi election promise  Rs 15 lakh  bank accounts  politics  

Other Articles