telugu states records the lowest temperature తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా.. 36 మంది మృతి

Telangana and andhra pradesh records the lowest temperature

Andhra pradesh, telangana, low temperatues, mercury falls down, phethai, phethai cyclone, low temperatue in telangana, low temperature in andhra pradesh, 34 dead in telugu states, telugu states

As per the weather department, the unseasonal rains caused due to phethai cyclone which bought freezing cold temperatures dropping drastically.

తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా.. 36 మంది మృతి

Posted: 12/19/2018 03:04 PM IST
Telangana and andhra pradesh records the lowest temperature

పెథాయ్ తుపాను ప్రభావానికి తోడు, ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల తీవ్రతతో తెలుగు రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా చలిగాలులు వీస్తూ.. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. బయటకు రావాలంటే కూడా జనం జంకుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో మంగళవారం మేఘం కమ్మేయగా, సూర్యుడు కూడా దర్శనం ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. పొగమంచు దట్టంగా దాపురించడంలో ప్రయాణికులకు పట్టపగటు కూడా లైట్లు వేసుకుని వెళ్లాల్సిన అవసరం వాహనదారులకు వచ్చింది.

చలి తీవ్రతకు తట్టుకోలేక ఇప్పటివరకు తెలంగాణ, ఏపీలలో 34 మంది ప్రాణాలు వదిలారు. ఆంధ్రప్రదేశ్ లో 23 మంది, తెలంగాణలో 11 మంది చలి కారణంగా మరణించారు. ఒక్క విశాఖ జిల్లాలోనే ఆరుగురు మృత్యువాత పడగా, ప్రకాశంలో ఐదుగురు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున చనిపోయారు. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. తెలంగాణలోని 11 మరణాలు సంభవించగా.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలో దాసరి వాడకు చెందిన రెండ్ల పెద్ద యాదగిరి (75) శీతల గాలుల తీవ్రతను తట్టుకోలేక చనిపోయాడు.

కాగా, హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకన్నా తక్కువకు, రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల దిగువకు పడిపోయాయి. పొగమంచు వల్ల విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలు విమాన సర్వీసులను ఆలస్యంగా నడుపుతున్నారు. ఇది ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నా, పరిస్థితుల వల్ల తప్పట్లేదని విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు. ఇక రానున్న మూడు, నాలుగు రోజుల్లో చలి పులి తన పంజాను మరింత బలంగా విసరనుందని అధికారులు హెచ్చరించారు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు వెళ్లాలని చెబుతున్న వైద్యాధికారులు.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తప్పని సరిగా స్వెటర్లు, జాకెట్లు వాడాలనీ, చిన్న పిల్లలు, ముసలివాళ్లు తప్పని సరిగా ఉన్ని వస్త్రాలు వేసుకోవాలని తెలిపారు. ఆస్తమా రోగులు, చిన్న పిల్లలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని హెచ్చరిస్తున్నారు. చలి గాలుల వల్ల స్వైన్‌ఫ్లూ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వ్యాధి భారిన పడకుండా జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : phethai cyclone  low temperatues  mercury down  telugu states  Andhra pradesh  telangana  

Other Articles