lagadapati rajagopal, bandla ganesh trolled by netizens లగడపాటి, బండ్లగణేష్ లను ఆడుకుంటున్న నెట్ జనులు

Lagadapati rajagopal bandla ganesh trolled by netizens

TRS, telangana elections 2018, Telangana Election Result, lagadapati rajagopal survey, Lagadapati Rajagopal, netizens, Congress, telangana assembly elections 2018, telangana politics

netizens trolled tollywood producer, congress leader Bandla Ganesh trolled for his comments on praja kutami win, and Lagadapati rajagopal for his survey which had gone wrong a long way.

లగడపాటి, బండ్లగణేష్ లను ఆడుకుంటున్న నెట్ జనులు

Posted: 12/11/2018 05:16 PM IST
Lagadapati rajagopal bandla ganesh trolled by netizens

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అసలు ఈ ఎన్నికలలో పోటీ చేయని నేతలు ఇప్పుడు చర్చనీయాంగా మారారు. ఇక నెట్ జనులైతే వీరిని సోషల్ మీడియా వేదికగా ఎన్నో విధాలుగా అడుకుంటున్నారు. ఇంతకీ వారెవరూ అంటారా..? వారిలో ఒకరు విజయావాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అయితే.. మరోకరు సినీనిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేష్. ఫలితాలు వెలువుడతున్న క్రమంలో తెలంగాణలో కారు దూసుకెళ్తుండగా వీరు మాత్రం మీడియాకు దూరంగా వున్నారు.

దీంతో వీరని టార్గెట్ చేసిన నెట్ జనులు వారిపై విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు ఈ ఇద్దరు నేతలను ఆడుకుంటున్నారు. ఎందుకంటారా.? మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని నేషనల్ మీడియా కోడై కూస్తే.. లగడపాటి రాజగోపాల్ మాత్రం ప్రజా కూటమిదే అధికార పీటం అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వాస్తవంగా చెప్పాలంటే గులాబీ నేతల గుండెల్లో గుబులు పుట్టించారు. అయితే ఫలితాలు మాత్రం లగపాటి సర్వేకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.

ఎన్నికల ఫలితాలకు ఆయన సర్వేకు ఎక్కడా పోంతన లేకపోవడంతో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ సుమారు 87 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే తమ ఉనికిని చాటుకుంది. అయితే విశ్వసనీయత వుండే రాజగోపాల్ సర్వే తారుమారు కావడంతో సోషల్ మీడియాలో అప్పుడే ట్రోలింగ్ మొదలైపోయింది. ‘ఆకు.. ఆకు తింటావా’ అంటూ ట్విట్టర్‌లో ఆడేసుకుంటున్నారు. లగపాటి రాజగోపాల్ ప్రజలను మోసం చేశారని, తొలిసారి ఆయన కచ్చితత్వాన్ని కోల్పోయారని మండిపడుతున్నారు. ‘సర్వే జన లగడ సుఖినో దుఖినో భవంతు’ అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

ఇక అటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సినీనిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై నెట్ జనులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే బ్లేడుతో గొంతు కోసుకుంటానని ఆయన చెప్పడం.. ఫలితాల రోజున సాయంత్రం ఏడు గంటలకు మీడియా మిత్రులు సెవన్ ఓ క్లాక్ బ్లేడు తీసుకురావాలని కోరారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు బండ్ల గణేశ్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ‘ ఆ బండ్ల గణేశ్‌ ఎక్కడా?.. నీ కోరిక మేరకే సెవన్ ఓ క్లాక్ బ్లేడు తీసుకున్నాం.. ఇంతకీ నీవెక్కడా.? అంటూ కొందరూ కామెంట్లు పెట్టగా, ‘కత్తులు సిద్ధంగా ఉన్నాయ్‌.. గొంతు కోసుకోవడానికి సిద్ధమా?’ అని ప్రశ్నిస్తూ సెటైర్లు వేస్తున్నారు. జోకులతో మెమెలను పోస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా బండ్లను ఇంటర్వ్యూ చేసిన ఓ చానెల్ జర్నలిస్ట్‌.. స్వీట్‌ బాక్స్‌తో పాటు బ్లేడ్‌లతో ఆయన ఇంటికి వెళ్లగా, ఇంటిలో నుంచి బయటకు వచ్చేందుకు బండ్ల గణేశ్ నిరాకరించారని సమాచారం.

 
 

 

 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lagadapati rajagopal  bandla ganesh  congress  telangana  politics  

Other Articles

Today on Telugu Wishesh