How to vote in elections without voter ID card గుర్తింపు కార్డు లేకున్నా ఇలా ఓటు వేయ్యచ్చు..

How to vote in elections without voter id card

right to vote, voter id card, EPIC card, ration card, aadhar card, pass port, telangana assembly elections 2018, telangana politics

Telangana Assembly Elections 2018: How to use Right for Vote, with out posessing voter identification card issued by Election commission of India

ఓటర్ గుర్తింపు కార్డు లేకున్నా ఇలా ఓటు వేయ్యచ్చు..

Posted: 12/05/2018 12:16 PM IST
How to vote in elections without voter id card

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నిర్ణీత సమయం కన్నా ముందుగానే రావడంతో ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకునే వారు అనవసరంగా అందోళన చెందాల్సిన పనిలేదు. ఇలా ఎందుకు చెబుతున్నామంటే జీహెచ్ఎంసీ ఓటరు లిస్టుతో ఎన్నికల బరిలోకి వెళ్తామని చెప్పిన రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికారులకు హైకోర్టు ఇచ్చిన పలు అదేశాలను పరిగణలోకి తీసుకుని గత నవంబర్ నెల వరకు కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాలను చేపట్టింది.

ఈ నేపథ్యంలో కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు.. తమ నివాసాలను మార్చుకున్న వారు తమ ఓట్లను నమోదు చేసుకున్నా.. వారికి మాత్రం ఇంకా ఓటరు గుర్తింపుకార్డులు నమోదు కాలేదు. ఈ ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో ఈ సేవా, మీ సేవా కేంద్రాలకు అక్సిస్ అందుబాటులో లేకపోవడంతో.. వారు కూడా ఓటరు గుర్తింపుకార్డులను ఫ్రింట్ ఇవ్వలేకపోయారు. దీంతో తాము ఓట్లు నమోదు చేసుకున్నా.. ఎన్నికల కమీషన్ అధికారులు జారీ చేసే గుర్తింపు కార్డులు మాత్రం అందలేదు.

అయితే తాజాగా ఈ-సేవా, మీ-సేవా కేంద్రాల్లో ఓటరు గుర్తింపు కార్డులు లభ్యం అవుతున్నాయని ఈసీ అధికారులు తెలిపారు. ఇక ఈ కార్డులకు రూ. 30 కన్నా అధికంగా చార్జీలు కూడా వసూలు చేయకూడదని ఈసీ అదికారులు అదేశాలు జారీ చేశారు. ఇక ఈ గుర్తింపు కార్డులు లేని వారు.. రాని వారు కూడా అందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఓటరు గుర్తింపు కార్డులు రాకున్నా కంగారు పడాల్సిన అవసరంలేదని తెలిపింది. ఓటరు లిస్టులో పేరుండి..ఓటరు ఐడీకార్డులేనివారు..  ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి ఓటు వేసేటప్పుడు చూపించాలని సూచించింది.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

* ఫోటో ఓటర్ స్లిప్
* ఆధార్ కార్డు..
* డ్రైవింగ్ లైసెన్స్
* పాస్ పోర్టు..
* సర్వీస్ ఐడెంటిటీ కార్డు.
* బ్యాంక్ పాస్ బుక్స్…
* పాన్ కార్డు..
* ఆర్బీఐ విడుదల చేసిన స్మార్ట్ కార్డ్
* జాబ్ ఐడీ కార్డు
* కార్మిక శాఖ విడుదల చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
* ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్,
* ఎంపీ-ఎమ్మెల్యే -ఎమ్మెల్సీల అధికారిక గుర్తింపు కార్డు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles