Lagadapati description on his pre-poll survey తెలంగాణలో కూటమిదే అధికారం: లగడపాటి

Lagadapati rajagopal condemns ktr comments on pre poll survey

Telangana elections 2018, lagadapati pre-poll survey, lagadapati-KTR pre poll controversy, Pre-poll survey, Rahul Gandhi, Congress, KCR, Chandrababu, kodandaram, KTR, lagadapati rajagopal, maha kutami, seat sharing, pre-poll survey, Telangana, Politics

Former MP Lagadapati Rajagopal condemns Telangana Minister KTR comments that he has manipulated his pre-poll survey with pressure of chandrababu.

తెలంగాణలో కూటమిదే అధికారం.. సర్వేపై విశ్లేషించిన లగడపాటి

Posted: 12/05/2018 01:33 PM IST
Lagadapati rajagopal condemns ktr comments on pre poll survey

రాష్ట్రంలో ఇక మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటు తధ్యమని మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. క్రితం రోజు తన సర్వే వివరాలు వెల్లడైన తరువాత ఇవాళ తన సర్వే టీమ్ నుంచి అందిన సమాచారం ప్రకారం వరంగల్ కూడా ప్రజాకూటమి వైపే వుందని తెలిపారని.. దీంతో తెలంగాణలోని ఐదు జిల్లాల్లో ప్రజాకూటమి తన అధిపత్యాన్ని కనబరుస్తుందని కూడా చెప్పారు. ఎవరో వ్యక్తులు తనపై ఒత్తిడి చేస్తే సర్వేలు మార్చే వ్యక్తిని తాను కాదని రాజగోపాల్‌ అన్నారు.

తనకు పదవుల కన్నా వ్యక్తిత్వం ముఖ్యమని చెప్పుకో్చ్చిన ఆయన.. కేటీఆర్ తన శాస్త్రీయంగా జరిపిన సర్వేపై తప్పుడు ట్వీట్లు చేసిన నేపథ్యంలో మరోసారి మీడియా ముందుకు వచ్చిన లగడపాటి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమిదే పైచేయిగా ఉందని, ప్రజా నాడి హస్తం వైపే ఉందని మరోమారు విశ్లేషించారు. సర్వే పేరుతో తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు తాను ప్రయత్నిస్తున్నానన్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.

టీఆర్ఎస్ కు 65 నుంచి 70 స్థానాలు వస్తాయంటూ గత నెల 20న తాన కేటీఆర్ కు సందేశాలు పంపానని, చంద్రబాబు ఒత్తిడితో ఇప్పుడు సర్వేను మార్చి కొత్త కథ చెబుతున్నానన్న అరోపణల్లో నిజం కాదని చెప్పారు. ‘‘ఒత్తిడితో తన సర్వే మార్చానని కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఎవరో ఒత్తిడి చేస్తే సర్వేలు మార్చే వ్యక్తిని కాదన్నారు లగడపాటి. తనకు పదవులు కన్నా వ్యక్తిత్వం ముఖ్యమని చెప్పారు. సెప్టెంబర్‌ 15 లేదా 16న కేటీఆర్‌ తన సమీప బంధువుల ఇంట్లో కలిశానన్నారు. అప్పట్లో ఎన్నికల విషయంలో కేటీఆర్ 25 స్థానాల్లో తన సాయం కోరారని చెప్పారు.

దీంతో ఎమ్మెల్యేలను మార్చకపోతే ప్రమాదం ఉందని తనకున్న రాజకీయ అనుభవంతో ఆ తర్వాత ఆయనకు సూచనలు చేశానని చెప్పారు. వారిని మారిస్తే మంచిదని కూడా సూచించానని చెప్పారు. అరెస్టులు చేయించడం మంచిది కాదని కూడా సూచించానన్నారు. చంద్రబాబును కలపుకొని వెళితే మంచిదని కూడా సూచించానన్నారు. కాని ఒంటరిగానే వెళతామని కేటీఆర్ బదులిచ్చారని.. మంచి సలహాలు, సూచనలు చేశారని కూడా కేటీఆర్ తనకు మెసేజ్‌ పెట్టారని తెలిపారు.

నవంబర్‌ 11 తేదీ నాటికి 37 మంది అభ్యర్థుల విషయంలో సర్వే చేసి.. కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యం ఉందని కేటీఆర్ కు మెసేజ్‌ పెట్టానన్నారు. పోటా పోటీగా ఉన్నప్పుడు అభ్యర్థులే ప్రధానం అవుతారని చెప్పానని.. అయితే వాస్తవికంగా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా వుందని ఆయన తనకు బదులిచ్చారని అన్నారు. మళ్లీ నవంబర్‌ 20న మహాకూటమిలో సీట్ల సర్థుబాటు వ్యవహరంలో ఇంకా ఏమీ తేలకముందే మరోసారి మెసేజ్‌ పెట్టానని అన్నారు.  దీంతో టీఆర్ఎస్ కు 65-70 వస్తాయని చెప్పా. కూటిమికి 35 నుంచి 40 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనాలు వచ్చాయని చెప్పానన్నారు.

దీనిపై స్పందించిన కేటీఆర్‌.. తన అంచనాలను కూడా దాటివేస్తామని చెప్తూ తనకు బదులిచ్చారన్నారు. ఆ తర్వాత ప్రజల ఆలోచన వేగంగా మారింది. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి తదితర హామీల విషయంలో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. కూటమి కట్టకముందు తెదేపాకు ఉన్న 20 శాతం ఓట్లు తెరాసకు వెళ్లాయి. కూటమి ఏర్పాటు తర్వాత ఆ ఓట్లు తిరిగి ప్రజాకూటమికి మళ్లాయి. ఈ ఉదయం కూడా మళ్లీ సమాచారం వచ్చింది. వరంగల్‌ జిల్లాలోనూ కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది’’ అని లగడపాటి వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  lagadapati rajagopal  maha kutami  seat sharing  pre-poll survey  Telangana  Politics  

Other Articles