kcr obstacles trs mla candidate entering the dias స్టేజీపైకి రాకుండా తమ అభ్యర్థిని అడ్డుకున్న కేసీఆర్

Cm kcr unidentifies his party ashwaraopet candidate in sathupalli

thati venkateswarlu, telangana elections 2018, CM KCR, kcr sathupalli meeting, Ashwaraopet TRS candidate, Telangana, Politics

Telangana care-taker CM KCR, obstacles his party ashwaraopet thati venkateswarlu from entering dias at sathupalli public meeting.

ITEMVIDEOS: తమ అభ్యర్థిని స్టేజీపైకి రాకుండా అడ్డుకున్న కేసీఆర్

Posted: 12/04/2018 11:10 AM IST
Cm kcr unidentifies his party ashwaraopet candidate in sathupalli

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ బిజీ బిజీగా ప్రచారం చేస్తున్నారు. రోజుకు ఏడెనమిది సభలకు తక్కువకాకుండా.. ఆయన ముమ్మరంగా ప్రచారం చేస్తూ.. తనదైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటుంటారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఇంతలా పాల్గోన్నది ఇదే తొలిసారని, అధినేతగా ఆయనపై వున్న బాధ్యతలను ఆయన ఇప్పుడు చక్కగా కనబరుస్తున్నారని పార్టీ శ్రేణులు కూడా చర్చంచుకుంటున్నారు.
 
అయితే తొలి విడత, మలివిడత ప్రచారంలో భాగంగా ఆయన ఎక్కడా ఏ విధంగా ప్రసంగించాలో ముందుగానే వ్యూహరచన కూడా చేసుకుని తదనుగూణంగా తన ప్రచారశైలిని కొనసాగించారు. అయితే తాజాగా సోమవారం నాడు కేసీఆర్‌ చేసిన ఓ చర్య టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ప్రశ్నార్థకంగా మారింది. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 3న ఉదయం ఖమ్మం జిల్లా సత్తుపల్లి సభకు వచ్చిన కేసీఆర్.. స్థానిక నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను వేదికపైకి ఎక్కుతున్న క్రమంలో.. అశ్వారావుపేట టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లును మాత్రం కేసీఆర్ అడ్డుకున్నారు.

వేదిక ఎక్కవద్దని వెనక్కి వెళ్లాలని కేసీఆర్‌ ఆదేశించడంతో ఆయన విస్మయానికి గురయ్యారు. తాను ఎన్నికల బరిలో వున్న అభ్యర్థినన్న విషయం అధినేత మర్చిపోయారా..? లేక పొరబాటుగానే తనను అడ్డుకున్నారా.? అర్థంకాక అశ్వారావు పేట టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు తెల్లముఖం వేశారు. ఓవైపు టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తుంటే తాను మాత్రం ఓ అనామకుడిలా దూరం వెళ్లిపోయి అటుఇటు తిరగడం టీఆర్ఎస్ అశ్వారవుపేట పార్టీ శ్రేణులకు అర్థంకావడం లేదు. కేసీఆర్‌ ఎందుకు ఇలా చేశారో, ఇందుకు కారణం ఏమై ఉంటుందన్న దానిపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles