CBI to re-investigate Ayesha meera case అయేషా మీరా కేసుపై సీబిఐ పునర్విచారణ..

Cbi to re investigate ayesha meera case

pharmacy student, ayesha meera, ibrahimpatnam, High Court, CBI, SIT, vijayawada court, satyam babu, key files missing, re-investigate, andhra pradesh, crime

After Andhra pradesh Government issues notice to CBI on no entry without prior information, High court handovers CBI to re-investigate pharmacy student Ayesha meera case.

సిబిఐ చేతికి అయేషా మీరా కేసు.. ఎంట్రీపై అంక్షలు..!

Posted: 11/29/2018 05:13 PM IST
Cbi to re investigate ayesha meera case

సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఆయేషా హత్య కేసులో విచారణ సవ్యంగా సాగలేదని గతంలోనూ అసంతృప్తిని వ్యక్తం చేసిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు.. ఈ కేసు పునర్విచారణను  సీబీఐకి అప్పగిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఆయేషా హత్య కేసులో సత్యం బాబు నిర్దోషి అంటూ గతేడాది హైకోర్టు నిర్థారించింది.

అయితే ఆయేషా హత్య కేసులో అసలు దోషులెవరో తేల్చి శిక్షించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల ఫైలు కనిపించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయేషా కేసులో దర్యాప్తు సరిగ్గా లేదంటూ పోలీసులపై మండిపడింది.

2007 డిసెంబర్‌లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆయేషా మీరా దారుణహత్యకు గురైంది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రతీ మలుపు సంచలనంగా మారింది. చివరకు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని తేలాడు కానీ... అసలు దోషులెవరో బయటపడలేదు. దీంతో దోషులెవరో తేల్చాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో ఆయేషా కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో దోషులకు శిక్ష పడుతుందా అన్న ఆసక్తి నెలకొంది.

కాగా, సీబీఐ ఎంట్రీపై అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో పలు సందేహాలు కూడా రేకెత్తుతున్నాయి. అయితే న్యాయనిపుణుల ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సాధారణ పరిపాలన అనుమతిని విత్ డ్రా చేసుకోవడానికి సర్వహక్కులు ఉన్నాయి. అయితే, ఆ రాష్ట్రానికి సంబంధించి కోర్టుల్లో ఉన్న ఏదైనా కేసు విషయంలో సుప్రీంకోర్టుగానీ, హైకోర్టు గానీ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం సీబీఐకి లేదు. నేరుగా కేసును విచారణ జరపవచ్చు. గతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి నో ఎంట్రీ అంటూ చెప్పిన నిబంధన ఈ విషయంలో వర్తించదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ayesha meera  CBI  SIT  vijayawada court  High Court  satyam babu  re-investigate  andhra pradesh  crime  

Other Articles