vemula veeresham cancel his campaign in nerada అప్పు తీర్చి గ్రామంలోకి అడుగుపెట్టు: వీరేశం తిరుగుముఖం

Trs candidate vemula veeresham cancel his campaign in nerada

vemula veeresham, satish reddy, creditor, clear debt, Rs 30 Lakh, TRS, Congress, Praja Front, Praja Kutami, etala rajender, driver, Telangana, politics

After a creditor dubbaka satish reddy of nakerekal TRS candidate vemula veeresham campaign with posters saying that to first clear the debt and then enter the village creates ruckus. The sitting MLA cancels his campaign in nerada village to avoid the tensions.

అప్పు తీర్చి గ్రామంలోకి అడుగుపెట్టు: వీరేశం తిరుగుముఖం

Posted: 11/29/2018 04:48 PM IST
Trs candidate vemula veeresham cancel his campaign in nerada

తెలంగాణలో విచిత్ర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అపధర్మ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పై ఆయన మాజీ డ్రైవర్ ఎన్నికల బరిలో నిలబడి ఈటెల ఓటమి తన విజయమని చెబుతున్నారు. అందుకు ఆయన కారణాన్ని కూడా చెప్పాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో తనపై కేసులు పెట్టిన పోలీసులు జైలుకు పంపగా, తాను విడుదలై వచ్చిన తరువాత తనకు కొందరు ఉదారవాద తెలంగాణ వాదులు 40 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారని చెప్పాడు. అయితే వాటిని ఈటెల తీసుకుని తనకు అన్యాయం చేశాడని చెప్పారు.

అందుకే తాను ఎన్నికల బరిలో నిలిచి ఆయనను ఓడించాలని పంతం పట్టినట్లు కూడా చెప్పుకోచ్చాడు. అయితే అదే అధికార టీఆర్ఎష్ పార్టీకి చెందిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యేకు కూడా తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా నకిరేకల్ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశంకు నేరేడ గ్రామంలో ఇదే పరిస్థితి ఎదురైంది. వేముల వీరేశం నేరడ గ్రామ పర్యటనను దుబ్బాక సతీశ్ రెడ్డి వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ‘నాకు ఇవ్వాల్సిన రూ.30 లక్షలు నా కుటుంబానికి చెల్లించు వీరేశం అన్న’ అనే పోస్టర్లు నేరేడ అంతటా దర్శనమిచ్చాయి.

ఈ నేపథ్యంలో దుబ్బాక సతీశ్ రెడ్డి వర్గీయులు వీరేశం పర్యటనను అడ్డుకోవచ్చన్న అనుమానంతో భారీగా పోలీసులను మోహరించారు. అనంతరం ఈ విషయాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అధికారులు తెలియజేశారు. చివరికి అనుచరులతో చర్చించిన వేముల వీరేశం.. నేరేడలో తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు పోలీసులకు తెలిపారు. దీంతో అధికారులు భద్రతను ఉపసంహరించుకున్నారు. దీంతో వేముల వీరేశం రూ.30 లక్షల రుణాన్ని తీసుకున్నారా.? తిరిగి చెల్లించారా.? లేదా అన్న విషయంలో క్లారిటీ మాత్రం రాలేదు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles