Pawan Kalyan to targets Kodela corruption కోడెల అక్రమాలపై పవన్ కల్యాణ్ గురి..

Pawan kalyan to targets speaker kodela sivaprasad rao corruption

pawan kalyan, janasena, guntur, sattenapally, corruption, narasaraopet, andhra pradesh elections 2019, andhra pradesh assembly election, AP assembly elections, Andhra Pradesh speaker, AP Legislative Assembly, Kodela siva prasad, speaker kodela, kodela shiva prasad, Kodela corruption, Andhra Pradesh, Politics

Actor turned politician Jana Sena chief pawan kalyan to target Andhra Pradesh speaker Kodela Siva Prasad Rao, in a public meet at guntur.

ITEMVIDEOS: కోడెల అక్రమాలపై పవన్ కల్యాణ్ గురి..

Posted: 11/16/2018 11:20 AM IST
Pawan kalyan to targets speaker kodela sivaprasad rao corruption

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ.. అధికార తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాలు అన్యాయాలపై గురిపెట్టింది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకుని అక్కడకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. త్వరలో గుంటూరు జిల్లాకు తన ప్రజాపోరాట యాత్రను తీసుకెళ్లనున్నారు. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అరచకాలు, అక్రమాలపై టార్గెట్ చేయనున్నారు.

సోషల్ మీడియా ద్వారా కోడెల శివప్రసాద్ రావు ఆగడాలను తెలుసుకున్న పవన్ కల్యాణ్.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంతో పాటు నరసారావుపేట అసెంబ్లీ స్థానంలో కూడా ఆయనతో పాటు ఆయన తనయుడు సాగిస్తున్న అన్యాయాలు, అక్రమాలపై జనసేన అధినేత దృష్టిసారించారు. దీంతో వారి అడగాలపై పవన్ కల్యాణ్ గుంటూరు పర్యటనలో నిలదీయనున్నారు. తాను అభాగ్యులకు, పేదలకు, బడుగు బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.. వారు అవే వర్గాలను టార్గెట్ చేసి అన్యాయాలు, అక్రమాలు సాగిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.

మరీ ముఖ్యంగా సొంత పార్టీకి చెందిన మున్సిఫల్ చైర్ పర్సెన్ కోడలు.. దీపావళి బాణాసంచా దుకాణాల అనుమతుల విషయంలో వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. ఈ విషయం సోషల్ మీడియాలో పెను సంచలనం కావడం.. కాకినాడ పర్యటనలో వున్న పవన్ కల్యాణ్ దృష్టికి ఇది రావడం.. ధీనిపై ఆయన చలించిపోయారు. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను తనకు సమర్పించాలని జనసేన గుంటూరు జిల్లా పార్టీ నాయకత్వాన్ని అదేశించినట్లు సమాచారం.

దీంతో పాటు కోడెల పేరున ఆయన తనయుడు అక్రమంగా.. అసంఘటిత వర్తకుల నుంచి వసూలు చేస్తున్న రోజు మామూళ్లు, K Tax, ఫార్మా ఇండస్ట్రీ పేరుతో నకిలీ మందులు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు, భూ దందాలు ఇలా తవ్వేకొద్దీ బయట పడుతున్న కోడెల ఆయన తనయుడు సాగిస్తున్న అక్రమాలపై పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. భారీ స్థాయిలో డబ్బు వసూలు చేయడం లాంటి అప్రజాస్వామిక కార్యక్రమాలకు ఎదుర్కొంటున్న బాధితులను తాను స్వయంగా పరామర్శిస్తానని కూడా చెప్పినట్లు సమాచారం. కోడెల అక్రమాలను, అన్యాయాలను సత్తెనపల్లి బహిరంగ సభ ద్వారా నిలదీస్తానని, అందుకు ఆయన సాగిస్తున్న అక్రమాల పూర్తి నివేదికను కూడా సమర్పించాలని పవన్ కల్యాణ్ పార్టీ జిల్లా నేతలను అదేశించారని తెలుస్తుంది.

ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే, విఫ్ చింతమనేని ప్రభాకర్ ను టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్.. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావును టార్గెట్ చేశారు. ఆయన అధికారాన్ని వినియోగించుకుని ఆయన కొడుకు సాగిస్తున్న అక్రమాలపై ఆయన తీవ్రంగా స్పందించి.. పూర్తి నివేదికలను కొరడం.. ఇప్పడు పార్టీలో చర్చనీయాంశమైంది. దీంతో జనసేనాని పవన్ కల్యాణ్ సత్తెనపల్లిలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసి.. అధికారపక్షం అక్రమాలపై నిలదీయనున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  guntur  sattenapally  corruption  narasaraopet  andhra pradesh  politics  

Other Articles