women protest over underwear comments లోదుస్తులతో మహిళల వినూత్న నిరసన..

Irish women bare their underwear in protest at rape trial

rape, this is not consent, ireland rape protest, ireland parliament underwear, rape culture, teenager rape, ireland court acquit accused, underwear, what was she wearing, Women tweeting underwear, ireland women protest, viral news

A series of protests over sexual consent has been shaking Ireland, a week after the 27-year-old was found not guilty for allegedly raping a 17-year-old teenager, where victim's underwear was shown as an evidence.

ITEMVIDEOS: లోదుస్తులతో మహిళల వినూత్న నిరసన..

Posted: 11/16/2018 12:29 PM IST
Irish women bare their underwear in protest at rape trial

ఆడదానికి అడదే శతృవు అన్నది పాత నానుడి.. ప్రస్తుతం అడవారిపై జరుగుతున్న దారుణాలకు అడవారికి అడవారే మద్దుతు ప్రకటిస్తున్నారు. ఎంతలా అంటే చివరకు న్యాయస్థానంలో ఓ టీనేజ్ అమ్మాయిపై జరిగిన అకృత్యపు కేసులో నిందుతుడ్ని దోషిగా పరిగణించకపోవడంపై మహిళాలోకం అందోళనను వ్యక్తం చేస్తూ.. తమ నిరసనను తెలిపింది. ఎంతలా అంటే ఇప్పుడీ బాధితురాలి తరపున యావత్ ప్రపంచంలోని మహిళా సంఘాలు కూడా అండగా నిలబడేలా చేస్తోంది.

తొలుత ఈ ఐర్లాండ్ కు చెందిన మహిళా ఎంపీ రూత్ కాపింజర్.. తమ దేశ న్యాయవ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ఆమె మహిళలు వేసుకునే అండర్ వేర్ ను  ప్రదర్శిస్తూ తన కోపాన్ని ప్రదర్శించారు. అంతే అమెకు అండగా ఆ దేశంలోని మహిళలు వేల సంఖ్యలో అమె చర్యకు మద్దతు తెలిపారు. సామాజిక మాద్యమాలు మరీ ముఖ్యంగా ట్విట్టర్.. మహిళల అండర్ వేర్లతో నిండిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రపంచంలోని పలు మహిళా సంఘాలు కూడా ఇదే విధంగా తమ నిరసనను వ్యక్తం చేశాయి. ఎందుకిలా.. అసలేం జరిగిందీ అంటే..

ఐర్లాండ్ లోని కార్క్ అనే పట్టణంలో ఇటీవల ఓ 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి అత్యాచారానికి గురైంది. అయితే ఈ దుశ్చర్యకు పాల్పడిన 27 ఏళ్ల వ్యక్తిని నిర్ధోషిగా ప్రకటించారు. అందుకు కారణం.. అఘాయిత్యం జరిపిన వ్యక్తి తరుపున వకాల్తా పుచ్చుకున్న లాయర్ న్యాయస్థానం వాదనల సందర్భంగా మాట్లాడుతూ ఆ యువతి ఎలాంటి అండర్ వేర్ వేసుకుందో తెలుసా అని ప్రశ్నించాడు. అమ్మాయి అప్పటికే మరొకరితో లైంగికంగా కలిసేందుకు సిద్ధపడిందని... అందుకు అమె వేసుకన్న అండర్ వేరే నిదర్శనమన్నారు. ఆమె వేసుకున్న బట్టలను పరిగణలోకి తీసుకోవాలంటూ జడ్జిని కోరారు.

దీంతో ఎంపీ రూత్ కాపింజర్ పార్లమెంటులో ఘాటుగా స్పందిస్తూ.. బాధితురాలిపై అత్యాచారం జరిగిందన్న విషయం మరిచి అమ్మాయి ధరించిన దుస్తులపై దృష్టి పెట్టడమేంటంటూ ప్రశ్నించింది. విచారణ సమయంలో ఎలాంటి ప్రశ్నలు వేయాలో కూడా తెలియదా అంటూ మండిపడ్డారు. ఎప్పుడూ బాధితులను తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ ఎంపీ కాపింజర్ ఆరోపించారు. బాధితులను వేధించడం నిలిపేయాలని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో బాధితురాలు వేసుకున్న అలాంటి అండర్ వేర్ అమె ప్రదర్శించారు.

కాగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ఐరిష్ ప్రధాని లియో వరాద్కర్ స్పందించారు. ఇది ఒక్కరి సమస్య కాదని దేశవ్యాప్తంగా ఉన్న మహిళల సమస్యగా చూస్తున్నట్లు చెప్పారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు లైంగిక దాడులు - వేధింపులపై కఠిన చట్టాలు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  న్యాయపరంగా కూడా పలు చట్టాలను తీసుకువస్తామని ప్రధాని చెప్పారు. అత్యాచార కేసుల్లో విచారణ కూడా త్వరతగతిని పూర్తయి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ireland  rape culture  teenager rape  ThisisNotConsent  underwear  Women  women rape  twitter  viral news  

Other Articles