will abide to fishermen development: Pawan Kalyan మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడివుంటామన్న జనసేనాని

Will abide to fishermen development pawan kalyan

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, pawan kalyan gangaputras, gangaputras development, gangaputras welfare schemes, pawan kalyan fishermen, pawan kalyan press meet, pawan kalyan coastal andhra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan says his party will be abide to the word given by him, his party will sduley work for the development of fishermen and gangaputras,

మత్స్యకారుల సంక్షేమం పట్టని అధికార, విపక్షాలు

Posted: 11/13/2018 04:43 PM IST
Will abide to fishermen development pawan kalyan

రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం.. ఇది ఎన్నికలకు మందు అన్ని పార్టీలు కొస్త్రాంధ్ర ప్రాంతంలో పర్యాటించిన సందర్భంలో చెప్పే మాటే. ఎన్నికలు ముగియగానే.. వారి సంక్షేమాల కోసం చెప్పిన మాటలను గాలి వదిలేస్తారు. మత్స్యకారులను ప్రగతికి దూరంగా వదిలేసి వారి జీవన ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తారు. సముద్రంలోకి వెళ్లి వారు ప్రతినిత్యం చేసే సాహసాలు దినదిన గండంగా మారుతున్నా.. వారి జీవితాలను భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు.

మత్స్యకారులు తరుపున, లేదా గంగపుత్రలు తరపున వాకాల్తా తీసుకుని రాజకీయ నేతల్లో కదిలిక తీసుకువచ్చే స్థాయిలో ఒక్క నాయకుడూ లేకపోవడంతో.. కేవలం ఎన్నికల ముందే వీరిని రాజకీయా పార్టీలు అదరిస్తాయి. ఆనక అవసరం తీరగానే దూరం పెడతాయి. చేసిన హామీలు గంగలో కలుపుతాయి. అయితే ప్రతిపక్ష పార్టీ సతైం వీరి మీద అదే ప్రేమను చూపుతుందే తప్ప.. మత్య్సకారుల్లోంచి ఓ మంచి వ్యక్తిని నాయకుడిగా ఎంచుకుని వారి రాజకీయ భవితవ్యం కల్పించేందుకు సాహసించారు.

కనీసం వారి తరువాతి తరాన్ని మెరుగుపర్చేందుకు కూడా చర్యలు తీసుకోరు. వారి వాడల్లో ఎంత దుర్గధం వెదజల్లినా.. పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇది వారి దీనస్థితి. అయితే ఏదేని కీడు జరిగినా.. తమ జీవితాలను సముద్రంతో ముడిపెట్టిన దేవుడిని నిందిస్తారే కానీ.. తమ నుంచి కూడా పన్నులు వసూలు చేసి.. జీవితాలను బాగుచేస్తామనే నాయకులను మాత్రం ఏమీ నిందించరు. వెయ్యి కీలోమీటర్ల మేర వున్న తీర ప్రాంతాన్ని నమ్ముకుని వేల సంఖ్యలో కుటుంబాలు వున్నాయి. వారి జీవనం మొత్తం సముద్రం మీద ఆదారపడే వుంటుంది. అయితే ఏళ్లకు ఏళ్లు, దశాబ్ధాలకు దశాబ్దాలు గడుస్తున్నా.. వీరిని పట్టించుకునే నాయకుడు కరువయ్యాడు.

అయితే తాజాగా రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలో అవిర్భవించిన నూతన రాజకీయ పార్టీ జనసేన మాత్రం వీరి కష్టాలను చూసి చలించిపోయింది. డబ్బుకోసమే.. పరపతి కోసమో తాను రాజకీయాల్లోకి రావడం లేదని.. కేవలం తమ కుటుంబాన్ని ఇంతగా ఆరాధిస్తున్న ప్రజలకు కొంతైనా మేలు చేసేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని స్పష్టం చేసిన జనసేనాని పవన్.. మత్స్యాకరులు కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, నష్టాలను తెలుసుకుని చలించిపోయారు.

మత్స్యకారులను తీరానికి చేర్చనున్న జనసేన

మత్స్యకారులను ఆదుకుని, అండగా నిలబడి.. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు జనసేన పార్టీ కట్టుబడి వుంది. రోజులకు రోజులు కుటంబాలకు దూరమై.. తాము ఎలా వున్నామన్న సమాచారం కూడా తెలియకుండా.. సముద్రంలోకి వెళ్లి చేపల వేటను సాగించే కుటుంబాలకు బాసటగా నిలవాలని.. వారి కుటుంబాల సంక్షేమానికి పలు పథకాలను కూడా అమలుపర్చాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్యాక్ కమిటీకి అదేశాలు జారీ చేశారు. ప్యాక్ కమిటీలోని  ప్రముఖులు మత్య్సకారుల సమస్యలపై అధ్యయనం చేస్తున్నారని కూడా సమాచారం.

మత్స్యకారులకు, గంగపుత్రులకు మరబోట్లు, అధునిక వలలు, భీమా సౌకర్యంతో పాటు ప్రత్యేక రాయితీలు కూడా కల్పించాలని వీరికి సరైన వసతులతో పాటు చేపల పునరుత్పత్తి కాలంలో నలభై అయిదు రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో వున్న సమయంలో వీరికి ప్రత్యామ్నాయ పనులను చూపించాలని కూడా జనసేన కమిటీ ఒక నివేదికను రూపొందించింది. ఇక మత్స్యకారుల కుటుంబాలలో తరువాతి తరానికి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కూడా జనసేన నిర్ణయింది.

ఇక దీనికి తోడు వారు దళారుల చేతుల్లో మెసపోకుండా మార్కెటింగ్ శాఖలను కూడా ఏర్పాటు చేసి వారి భవిష్యత్తును.. కష్టానికి తగిన ఫలితాన్ని అందించాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. మత్స్యకారులు కుటుంబాలలో అర్థిక అభివృద్ది చెందేలా, సామాజిక గౌరవం పొందేలా చర్యలు తీసుకోవాలని కూడా జనసేన తమ ఎన్నికల మానిఫెస్టోలో చేర్చాలని భావిస్తుంది. గంగపుత్రులకు రాజకీయ నాయకత్వం లేకపోవడంతో వారి కష్ట,నష్టాలు, ఇబ్బందులు ప్రభుత్వాల దృష్టికి చేరడం లేదని జనసేన అభిప్రాయానికి వచ్చింది.

రెక్కడితే కానీ డొక్కడని మత్స్యకారుల జీవితాలను తనవంతుగా అదుకున్న మత్స్యకారులు సంఘ అధ్యక్షుడు బాబురావు హఠాన్మరణంతో వారి వేదనలు, రోదనలు చెవిటివాడి ముందు శంఖంలా తయారయ్యింది. దీంతో రాజకీయ ప్రాధాన్యత లేకపోవడమే ఈ వర్గ ప్రజలకు శాపంగా పరిణమించిందని యోచించిన జనసేనాని పవన్ కల్యాణ్.. మత్స్యకారులపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ వారికి పార్టీలో కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్యాక్ కమిటీకి సూచించారు. ఈ వర్గప్రజల నుంచి మంచి రాజకీయ నాయకత్వం పెంపోందేలా చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించేలా ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పదవులు కల్పించాలని అదేశించారు.

అంతేకాదు ఈ వర్గం నుంచి ఎదుగుతున్న నాయకులలో మంచివారిని గుర్తించి వారిని పీఏసీ కమిటీలో చేర్చాలని పార్టీలో ముఖ్యులకి సూచించినట్లు సమాచారం. మత్స్యాకారులు, గంగపుత్రు వర్గాల ప్రజల సమస్యలపై అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ అందించిన నివేదిక ఆధారంగా వీరికి ఆధునిక మరబోట్లు, ప్రత్యేక నిధులు, గృహాలు, వారి పిల్లలకు ప్రత్యేక విద్యాలయాలు, కళాశాలలు, పాలిటెక్నిక్, ఐటిఐలు కూడా అందుబాటులో తేవాలని జనసేన తమ మానిఫెస్టోలో పొందుపర్చనున్నారు.

అంతేకాదు మత్స్యకారులకు కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు కల్పించి.. దీనికి తోడు మార్కెటింగ్ సౌకర్యం, ప్రత్యేక రాయితీలు, పెన్షన్ పథకాలు, వ్యవసాయ భూములు కూడా కల్పించాలని నిర్ణయించింది. దీనికి తోడు వెయ్యి కిలోమీటర్ల మేర వున్న తీర ప్రాంతాన్ని ఐదు జోన్లుగా విభజించి అభివృద్ది పర్చేలా ఏర్పాటు చేసే దిశగా ఒక బృహత్తర ప్రణాళికను సిద్దం చేసి పార్టీ మానిఫెస్టోలో పొందుపర్చాలని జనసేనాని పవన్ కల్యాణ్ మానిఫెస్టో కమిటీని అదేశించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని జనసైనికులు బలంగా మత్స్యకారుల్లోకి తీసుకెళ్తే.. వచ్చే ఎన్నికలలో అనూహ్యంగా జనసేన పార్టీని గెలిపించి తాము కూడా తీరం చేరేందుకు మత్స్యకారులు పట్టుదలతో ఉన్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles