r krishnaiah called for bandh on 17th 17న తెలంగాణ బంద్ కు బీసీ సంఘాల పిలుపు

Bc sangh telangana bandh on 17th

telangana elections 2018, Telangana bandh, R Krishnaiah, bc bandh, TRS, Congress, Praja kutami, BJP, BLF, BC sangh national president, krishnaiah called bandh, Congress List, bc organizations

Backward castes sangh national president R.Krishnaiah calls up for Telanagan bandh on 17th, protesting against political parties denying tickets to BC leaders.

17న తెలంగాణ బంద్ కు బీసీ సంఘాల పిలుపు

Posted: 11/13/2018 03:07 PM IST
Bc sangh telangana bandh on 17th

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు టిక్కెట్ల కేటాయించడంలో ఒక్క పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపితో పాటుగా ఇటు మహాకూటమి కూడా వెనకబడిన తరుగతులకు అన్యాయం చేసిందని అరోపించారు. జనాభా ప్రతిపదికన తక్కువ సంఖ్యలో వున్న అగ్రకులాలకు అధికసంఖ్యలో టికెట్లు కేటాయించడమేంటని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా వెనకబడిన వర్గాల ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 17న రాష్ట్రవ్యాప్త బంద్‌ చేపట్టాలని నిర్ణయించినట్లు కృష్ణయ్య ప్రకటించారు. ఈ బంద్ లో బీసి వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కూడా పాల్గోని జయప్రదం చేయాలని కోరారు. బీసీలలో రాజకీయ చైతన్యం రాకూడదని భావించిన పార్టీలు ఇలా వ్యవహరిస్తున్నాయని, ఒక్క బీఎల్ఎఫ్ పార్టీ మాత్రమే బీసీలకు సముచిత సంఖ్యలో బీసీలకు టికెట్లను కేటాయించిందని అన్నారు.

దేశంలో 56శాతానికి పైగా ఉన్న బీసీలకు 14శాతం కూడా ప్రాతినిధ్యం లేదని.. ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని నిలదీశారు. తెలంగాణలో ఓ పథకం ప్రకారమే పార్టీలన్నీ బీసీలపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే బీసీలకు సీట్లు కేటాయించలేదన్నారు. బీసీలకు సీట్ల కేటాయింపు విషయంలో పార్టీలన్నీ పునరాలోచించుకోవాలని సూచించారు. ఇక కాంగ్రెస్ ప్రకటించిన జాబితాపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. బీసీలకు కనీసం 25 సీట్లు కేటాయించాలని కోరితే కేవలం 13 స్థానాలు మాత్రమే ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana bandh  R Krishnaiah  bc bandh  TRS  Congress  Praja kutami  BJP  BLF  BC sangh  

Other Articles