check your vote programme in telangana ఓటరు లిస్టులో మీపేరుందా.? ఇలా చూసుకోండి: తెలంగాణ సీఈఓ

Telangana ceo brings check your vote verification programme to voters

telangana ceo, telangana assembly elections, voter list, new voter list, check your vote, ceo special verification programme, election commission, election officers, polling stations, Telangana

telangana election commission has implimented a news special verification programme at booth level polling station. With this telangana voters can check thier vote in the list. If any objections araise they can settle down them at then and there.

ఓటరు లిస్టులో మీపేరుందా.? ఇలా చూసుకోండి: తెలంగాణ ఈసీ

Posted: 11/03/2018 01:20 PM IST
Telangana ceo brings check your vote verification programme to voters

రాష్ట్రం ఓటర్ల జాబితాలో అనేక అక్రమాలు జరిగాయని.. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపును తట్టడంతో.. ఈ విషయంలో రాష్టోన్నత న్యాయస్థానం హైకోర్టులోనే ఈ అంశాన్ని తెల్చుకోవాలని, అందుకు పలు కండీషన్లను కూడా హైకోర్టుకు విధించిన సూచనలు జారీ చేయడంతో ఎట్టకేలకు తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులు మెట్టుదిగిరాక తప్పలేదు. రాష్ట్రంలో అనేక మంది అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలోంచి తొలగించారని, అదే క్రమంలో ఒక్కో ఇంటి నెంబరుపై 150 నుంచి అపైన కూడా ఓట్లు నమోదయ్యాయని న్యాయస్థానం దృష్టికి శశిధర్ రెడ్డి తీసుకువచ్చారు.

అయితే అక్రమాలు ఏమీ లేవంటూ.. ఇంకా తుది జాబితా ప్రకటించలేదని, తుది జాబితాలో పలు సవరణలు చేస్తామని ఎన్నికల అధికారులు హైకోర్టుకు వివరించారు. అయితే ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఎన్నికల అధికారులకు పలు అదేశాలను జారీ చేసింది. తుది జాబితా నేపథ్యంలో పలు మార్గదర్శకాలను పాటించాలని అదేశించింది. ఈ క్రమంలో అక్రమాలు జరగకుండా అందరి పేర్లు జాబితాలో వుండేందుకు సకల చర్యలు తీసుకున్న తెలంగాణ ఎన్నికల అధికారులు చెక్ యువర్ ఓట్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు.

తెలంగాణలో బూత్ స్థాయిలో ఈ అదివారం ఈ కార్యక్రమం జరగనుంది. బూత్ స్తాయిలో సంబంధిత ఎన్నికల సంఘం అధికారులు బూత్ లలో వుండి ఓటర్ల జాబితాను పరిశీలించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా ఓటర్ల జాబితాను ఓటర్లు పరిశీలించుకునే అవకాశం వుంది. ‘కొత్త జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్‌ చేసుకోండి. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు ఉంటారు. వారిని సంప్రదించి జాబితా చెక్‌ చేయండి. అభ్యంతరాలు ఉంటే అక్కడికక్కడే  అధికారులకు తెలియజేయండి’ అంటూ ఎన్నికల సంఘం సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana ceo  assembly elections  new voter list  check your vote  polling stations  Telangana  

Other Articles