2 held for snatching gold chain కత్తితో బెదరించి మహిళ మెడలోని బంగారం చోరి

Two bike borne assailant snatched chain of a woman

Delhi woman robbed at knifepoint, Bike-borne robbers snatched woman, woman, chain snatching, woman and son, Robbers, kinfe point, jewellery, child, attacked, Khajuri Khas police station, Bike-borne robbers, delhi, CCTV cam, crime

Two persons were arrested for snatching a gold chain from a woman here a week ago, police said. Acting on a tip, Nadeem (20) and Faizan (21) were taken into custody from Nehru Vihar in north Delhi and the chain was recovered from them.

ITEMVIDEOS: ఢిల్లీలో దొంగల బరితెగింపు: కత్తితో బెదరించి మహిళ మెడలోని బంగారం చోరి

Posted: 11/03/2018 12:19 PM IST
Two bike borne assailant snatched chain of a woman

అర్థరాత్రి అడది ఒంటరిగా (స్వేచ్ఛగా) తిరిగ గలిగినాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని జాతిపిత పూజ్య బాపూపీ మహాత్మాగాంధీ 1947లోనే అన్నారంటే దాని వెనుక ఎంత నిగూఢార్థం దాగివుందో ఇప్పటికీ కానీ దేశప్రజలకు అర్థం కావడం లేదు. అయన అన్న వ్యాఖ్యలను ఎవరికి తోచిన రీతిలో వారు తిప్పికోడుతున్నారు.. కానీ బాపూజీ చేసిన వ్యాఖ్యలు వెనుకనున్న అంతరార్థాన్ని మాత్రం అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నారు. దొంగతనాలు, కామాంధుల భయం లేకుండా నిర్భయంగా వారు తిరగగలిగినాడే దేశానికి అసలైన స్వతంత్ర్యం వచ్చినట్లు అని అర్థం చేసుకోకుండా నానార్థాలు తీసి నవ్వుకుంటున్న వారికి ఈ ఘటన షాకిస్తుంది.

దేశ రాజధాని ఢిల్లీలో జనసాంధ్రత పెరుగుతూ నేరాలకు కూడా రాజధానిగా మారిపోతుంది. మహిళలపై అకృత్యాలతో పాటు వారిపై లైంగిక వేధింపులు కూడా అధికం అవుతున్న క్రమంలో సక్రమమైన రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ.. నేరాలు జరగకుండా జాగ్రత్తచర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థ కాస్తా.. నేరం జరిగిన తరువాత పిర్యాదులు, కేసులు, చేధింపులకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో దేశంలో కాదు కనీసం దేశ రాజధానిలో మహిళలకు అర్థరాత్రి కాదు తొమ్మిన్నర గంటలకు రక్షణ లేకుండా పోయింది.

ఈ ఘటన స్థానికంగా గల సిసిటీవీ కెమెరాలో నిక్షిప్తం కావడంతో వారిని గుర్తించిన పోలీసులు 24 గంటల వ్యవధిలో వారిని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఇది తమ పోలీసు పనితీరు అని కితాబిచ్చుకుంటున్నారు. ‘రక్షక’భటులు అన్న పదానికి అర్థాన్ని మార్చివేస్తున్నారు. నేరం జరిగిన తరువాత నేరగాళ్లను అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు పోలీసులకు గోప్పగా మారిపోయిందా.? అన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

దేశరాజధాని ఢిల్లీలోని ఖజూరీ ఖాస్ అనే ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఏడేళ్ల బిడ్డను ట్యూషన్ నుంచి తీసుకుని రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఇంటికి తిరిగి వెళ్తుండి. అదే సమయంలో ఓ ద్విచక్రవాహనం వారిపై వైపు దూసుకోచ్చింది. వాహనం వెనకనున్న ఓ అగంతకుడు వాహనం నెమ్మదిస్తున్న సమయంలోనే మహిళ మెడను పట్టుకున్నాడు. ఇంతలో మహిళ వెనక్కు జరిగింది. అయితే వెంటనే బైక్ దిగిన అగంతకుడు అమెను అడ్డగించి.. కత్తితో బెదిరించాడు.  

కత్తిని చూడగానే హడలిపోయిన బాధితురాలు నిష్చేష్టురాలైంది. అదే అదనుగా బావించిన దుండగుడు అమె మెడలోంచి బంగారాన్ని లాక్కున్నాడు. అయితే దుండగుల హఠార్పిణామం నుంచి కోలుకున్న మహిళ తేరుకుని ముందుకు కదులుతుండగా మరోమారు వచ్చి బాధితురాలని అడ్డగించిన అగంతకుడు.. అమె మెడలో వున్న మరో గొలుసుతో పాటు చివి దుద్దులను కూడా లాక్కెళ్లాడు. దొంగలు తమ తల్లిని అడ్డగించి బంగారాన్ని లాక్కెళ్లుతన్న ఘటనను చూసిన ఏడేళ్ల బాలుడు కూడా అందోళన చెందాడు.

ఈ ఘటనను తలుచుకుంటూ ఇంటికి చేరిన బాధిత మహిళ.. ఖజూరీ ఖాస్ పోలీసులకు ఫోన్ ద్వారా పిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి సిసిటీవీ కెమెరా ఫూటేజీని పరిశీలించి.. దొంగలను గుర్తించారు. వారు నెహ్రూ విహార్ కు చెందిన నదీమ్, ఫైజాన్ అనే ఇద్దరు దొంగలు గుర్తించిన పోలీసులు వారే బాధితురాలని బెదిరించి బంగారు అభరణాలు లాక్కెళ్లారని వారిపై నిఘా పెట్టి 24 గంటల వ్యవధిలో కేసును చేధించి.. బంగారాన్ని రికవరీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  chain snatching  Robbers  kinfe point  jewellery  Khajuri Khas police station  delhi  CCTV cam  crime  

Other Articles