Prathap Reddy Sensational comments on Harish Rao కేసీఆర్ ఓటమికి హరీష్ సహకారం: ఒంటేరు ప్రతాప్ రెడ్డి

Onteru prathap reddy sensational comments on harish rao

Congress, Gajwel Candidate, Onteru Prathap Reddy, Sensational comments, Harish Rao, defeat, CM KCR,Gajwel, Telangana, politics

Congress Gajwel Candidate Onteru Prathap Reddy Sensational comments on Harish Rao, says asked me to defeat CM KCR in Gajwel.

ITEMVIDEOS: కేసీఆర్ ఓటమిని కొరుకున్న హరీష్ రావు: ఒంటేరు ప్రతాప్ రెడ్డి

Posted: 11/03/2018 06:12 PM IST
Onteru prathap reddy sensational comments on harish rao

గజ్వెల్ నుంచి రెండో పర్యాయం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్న తన మామ, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎలాగైనా ఓడించాలని మంత్రి హరీశ్ రావు తనను కోరారని గజ్వల్ కాంగ్రెస్‌ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాలతో పార్టీలో తనకు దక్కాల్సిన గౌరవం దక్కకుండా పోతుందని, తన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పుకోచ్చారని ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందుకనే ఎలాగైనా కేసీఆర్‌ను గజ్వేల్ లో ఓడించాలని హరీశ్‌ తనను కోరినట్లు ఆయన వెల్లడించారు. ఓ ప్రైవేట్‌ నెంబర్‌ నుంచి హరీశ్‌రావు నిన్న తనకు ఫోన్‌ చేశారని.. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాలని, అవసరమైన ఆర్థియ సాయం అందిస్తానని ఆయన తనతో అన్నట్టు ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని బాధ్యతలను కేటీఆర్ కే అప్పగిస్తూ కేసీఆర్‌ తన ఇజ్జత్ తీస్తున్నారని, ఆయన వైఖరితో రాజకీయ జీవితం లేకుండా పోతోందని హరీశ్‌ తనతో వాపోయినట్లు ప్రతాప్‌ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ ను ఓడించేందుకు కలిసి పనిచేద్దామన్నారని వివరించారు. అందుకు కావాల్సిన ఆర్థికసాయం కూడా అందిస్తానని హరీశ్‌ చెప్పారని.. అవినీతి సొమ్ము తనకు వద్దని తిరస్కరించానని అన్నారు. తనకు గజ్వేల్‌ ప్రజలు, యువత అండగా ఉన్నారని, కేసీఆర్‌ కుటుంబం మొత్తం వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా విజయం తననే వరిస్తుందని ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ లో నిర్వహించిన ఓ సమావేశంలో ప్రతాప్‌ రెడ్డి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై ఏ దేవుడిపైనైనా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles