TRS has denied alliance with TDP says Chandrababu టీఆర్ఎస్ అప్పుడు తిరస్కరించింది.. ఇప్పుడిలా: చంద్రబాబు

Trs has denied alliance with tdp says chandrababu

Telangana, Praja kutami, Ruling TRS, UPA, NDA, BJP, AIMIM, TDP, CPI, TJS, Congress, Lok sabha elections, Chandrababu, Assembly polls, Politics

TDP Party national President Chandrababu Naidu had admited he tried for alliance with Telangana Ruling party TRS, but they had denied it. They have another type of interest with Telangana TDP said AP CM.

టీఆర్ఎస్ అప్పుడు తిరస్కరించింది.. ఇప్పుడిలా: చంద్రబాబు

Posted: 11/02/2018 03:28 PM IST
Trs has denied alliance with tdp says chandrababu

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో పొత్తు కుదుర్చుకునేందుకు తాము ప్రయత్నాలు చేశామని అయితే వాటికి అధికార టీఆర్ఎస్ అంగీకరించలేదని అంధ్రప్రదేశ్ సీఎం, టడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తో పొత్తుకు తాను ముందుకు వచ్చినప్పటికీ, కేసీఆర్ నిరాకరించారని తెలిపారు. ఇటీవల అసెంబ్లీని రద్దు చేసిన తరువాత నిర్వహించిన ఓ సభలో.. వారు కోరుకునే నాలుగు సీట్లు అడిగివుంటే తానే ఇచ్చేవాడినని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని చంద్రబాబు తప్పబట్టారు.

అయితే తన అభిమతం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలన్నదేనని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో టీడీపీని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే తాము ప్రజాకూటమిలో చేరామని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ అని హడావుడి చేసిన కేసీఆర్, ఆపై దాన్ని వదిలేసి ఇప్పుడదే పార్టీతో తెరవెనుక ఒప్పందాలు చేసుకుని ముందకు సాగుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీతో కలసి వున్న సమయంలో లేని ఐటీ దాడులు ఇప్పుడెందుకు జరగుతున్నాయని ప్రశ్నించారు.

తమతో విడిపోతే పరిస్థితులు ఎలా వుంటాయన్నది బీజేపి తమకు రుచిచూపించాలని, ముప్పేటదాడులతో భయపెట్టాలని చూస్తున్నారని చెప్పిన చంద్రబాబు, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదని, ఎవరికీ భయపడలేదని అన్నారు. తన ప్రత్యర్థులంతా నాశనం కావాలన్న నిరంకుశ వైఖరితో మోదీ ఉన్నారని, ఆయన వైఖరిని ఎదిరించేందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలశామని స్పష్టం చేశారు.

వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు తాను హస్తిన ప్రయాణం చేయడాన్ని దేశమంతా ఆసక్తిగా చూసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అక్టోబర్ 27నాటి పర్యటనతో అందరిలో నమ్మకం కలిగిందని, నిన్నటి పర్యటనతో భరోసా వచ్చిందని, ఒకరిద్దరు తప్ప అన్ని పార్టీలూ ఒకే తాటిపైకి వస్తున్నాయని అన్నారు. మిగిలిన పార్టీలతోనూ తాను సమావేశమై, అందరినీ కలిపేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ఇదొక చరిత్రాత్మక ఉద్యమమని, ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్టే పాలకులు నిర్ణయాలకు వ్యతిరేకంగా తెరపైకి వచ్చిన ఉద్యమమని అన్నారు. బీజేపీని ఎదుర్కోలేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Praja kutami  Ruling TRS  Lok sabha  Assembly polls  Chandrababu  BJP  Telangana  Politics  

Other Articles