Bofors case : SC dismisses CBI plea to re-open case బోఫోర్స్ కేసులో కాంగ్రెస్ కు భారీ ఊరట

Big relief for congress bofors case buried forever

Supreme Court, Hinduja brothers, delhi high court, CBI, Bofors case, Rajiv Gandhi, Ottavio Quattrocchi, BJP Ajay Agrawal, Indian Army

The Supreme Court dismissed CBI's appeal against the Delhi High Court verdict discharging all the accused including Hinduja brothers in Rs 64 crore Bofors pay-off case.

బోఫోర్స్ కేసులో కాంగ్రెస్ కు ఊరట: పునర్విచారణకు ‘సుప్రీం’ నో

Posted: 11/02/2018 04:12 PM IST
Big relief for congress bofors case buried forever

కాంగ్రెస్‌ పార్టీకి సుప్రీంకోర్టులో ఇవాళ ఊరట లభించింది. బోఫోర్స్ కుంభకోణం కేసుపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏకంగా 13ఏళ్ల తరువాత ఈ కేసుపై పునర్విచారణ చేయాలని కోరడం చాలా అలస్యమైందని.. అయితే ఇదే కుంభకోణంలో అజయ్ అగర్వాల్ అనే న్యాయవాది, బీజేపి నేత వేసిన కేసును ఇప్పటికే విచారిస్తున్నామని అత్యున్నత న్యాయస్థానం పేర్కోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించినట్లైంది.

బోఫోర్స్ కుంభకోణంపై 2005 మే 31న ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ... సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దశాబ్దకాలం పాటు ఈ కేసును వాదిస్తూ వచ్చిన బీజేపీ నేత, న్యాయవాది అజయ్ అగర్వాల్... హైకోర్టు తీర్పుపై 90 రోజుల్లోగా సీబీఐ సవాల్ చేయలేకపోవడంతో అదే ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్లో సీబీఐని కూడా తన ప్రతివాదిగా పేర్కొన్నారు. ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు అంగీకరించగా.. ఇప్పటికీ అది పెండింగ్‌లో ఉంది.
 
ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ ప్రతివాదిగా స్పందిస్తుందా లేక ప్రత్యేక పిటిషన్ దాఖలు చేస్తుందా అన్నదానిపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. తీవ్ర తర్జనభర్జనల తర్వాత సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ వేసేందుకు కేంద్రం సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు దశాబ్దకాలం తర్వాత బోఫోర్స్‌‌పై హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా పిటిషన్ వేయాలంటూ స్వయంగా అటార్నీ జనరల్ వేణుగోపాల్ సీబీఐకి సూచించినట్టు ఊహాగానాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణులతో విస్తృత సంప్రదింపుల తర్వాత.. ‘‘కొన్ని ముఖ్యమైన పత్రాలు, ఆధారాలు’’ ఉన్నాయంటూ హైకోర్టు తీర్పును సీబీఐ సవాల్ చేసింది. బోఫోర్స్ కుంభకోణంపై తన దర్యాప్తును రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ధ్వంసం చేసిందంటూ 2017లో ప్రయివేటు డిటెక్టివ్ మిఖాయిల్ హార్ష్‌మాన్ ఆరోపించడంతో... ఇదే అదనుగా బోఫోర్స్ కేసును తిరగదోడేందుకు అటార్నీ జనరల్ వేణుగోపాల్ సీబీఐని ముందుకు తోసినట్టు చెబుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Hinduja brothers  CBI  Bofors case  Ajay Agrawal  Indian Army  

Other Articles