In Poll-bound Telangana, TRS Suffers Minor Fall తెలంగాణలో ప్రజాకూటమి వైపే ఓటరు మొగ్గు..

National approval ratings in poll bound telangana trs suffers minor fall

National Approval Ratings, Telangana, Praja kutami, Ruling TRS, UPA, NDA, BJP, AIMIM, TDP, CPI, TJS, Congress, Lok sabha elections, Republic TV, C-voter, survey, Assembly polls, Politics

The BJP is slated to get 1 seat, the INC-TDP combine is pegged to get 8 seats and the TRS is set to get to get 7 seats. Owaisi is set to pick up 1 seat in Telangana, states Republic TV and CVoter National Approval Ratings survey.

తెలంగాణలో ప్రజాకూటమి వైపే ఓటరు మొగ్గు..

Posted: 11/02/2018 02:39 PM IST
National approval ratings in poll bound telangana trs suffers minor fall

తెలంగాణలో ఇప్పుడు ఎవరి నోట విన్నా.. గెలుపెవరిదీ అన్న మాటే.. అదే చర్చ. ఏ ప్రధాన కూడలిలో కూర్చున్నా.. గ్రామపంచాయితీల్లోని తాతాల బండ (వసార్లలోని బండలపై కూర్చునే తాతాల) వద్ద నుంచి హైదరాబాద్ మహానగరంలోని ఏ టీ షాపు, కార్యాలయాలు తీసుకున్నా ఇదే చర్చ. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ వైపు తమ అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో దూసుకుపోతున్నా.. ప్రజాకూటమి మాత్రం ఇప్పటికీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు.

ఈ నెల 8 లేదా 9వ తేదీల్లో అభ్యర్థుల పేర్లను తాము ఖారారు చేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రజాకూటమిగా నాలుగు పార్టీలు కలసి ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ చర్చలు జరిగేందుకే తమకు కొంత సమయం పట్టించదని కూడా ఆయన తెలిపారు. తెలంగాణలోని 95 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, 14 స్థానాల్లో టీడీపీ, మిగిలిన పది స్థానాల్లో సిపీఐ, టీజేఎస్ పార్టీలు పోటీ చేయనున్నాయని కూడా స్పష్టం చేశారు. అయితే తమకే పార్టీ టికెట్ లభిస్తుందన్న ధీమా వున్న అభ్యర్థులు మాత్రం తమవంతుగా ప్రచారం చేసుకుంటున్నారు.

ఇదిలావుండగా, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే మాత్రం ప్రజాకూటమి వైపు ఓటర్ల మొగ్గు వుంటుందని తాజాగా సర్వేలో తేలింది. అయితే ఇవి అసెంబ్లీ ఎన్నికలు కాదండోయ్.. లోక్ సభ ఎన్నికలు. నవంబర్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి వైపే ఓటర్లు మొగ్గు ఉందని, టీఆర్ఎస్ కన్నా కూటమికి అధిక స్థానాలు వస్తాయని రిపబ్లిక్, సీ-వోటర్ సర్వే వెల్లడించింది. తెలంగాణలో గతంలో కేవలం రెండు లోక్ సభ స్థానాలను మాత్రమే గెలిచిన కాంగ్రెస్ ఈ సారి అధికస్థానాలను చేజిక్కించుకుని లబ్దిపొందనుందని అంచాన వేసింది.

రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలుండగా, మహాకూటమికి 8, టీఆర్ఎస్ కు 7, ఏఐఎంఐఎంకు ఒక్క స్థానం, బీజేపికి ఒక్క స్థానం లభిస్తుందని అంచనా వేసింది. మహాకూటమికి 32.2 శాతం ఓట్లు, టీఆర్ఎస్ కు 30.4 శాతం ఓట్లు, బీజేపీకి 19 శాతం ఓట్లు, ఏఐఎంఐఎం కు 3.9 శాతం ఓట్లు లభిస్తాయని రిపబ్లిక్, సీ-వోటర్ సర్వే తెలిపింది. దీంతో గతంలోకన్నా మెరుగ్గా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి గెలుపును అందుకుంటుందని కూడా అంచనా వేసింది. ఇక మరోవైపు ఈ అంచనాలు ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొంత భిన్నంగా ఉండవచ్చని కూడా పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Praja kutami  Ruling TRS  Lok sabha  Assembly polls  Republic TV  C-voter  survey  Telangana  Politics  

Other Articles