Even sex-workers have right to refuse: SC వ్యభిచారిణులతోనైనా ఇష్టంలేని సంబోగం నేరమే: సుప్రీం

Even sex workers have right to refuse supreme court

Rape, Gangrape, Supreme Court, sex-workers, Justices R. Banumathi, Indira Banerjee, Delhi High Court, lower court, #MeTooIndia, MJ Akbar, The Asian Age, Crime

Even sex-workers have a right to refuse their services and seek redressal when forced, the Supreme Court has ruled, overturning a 2009 Delhi High Court judgement and restoring the 10 years jail awarded to four persons by a lower court.

వ్యభిచారిణులతోనైనా ఇష్టంలేని సంబోగం నేరమే: సుప్రీం

Posted: 11/02/2018 01:30 PM IST
Even sex workers have right to refuse supreme court

దేశంలో ఓ వైపు మీటూ ప్రకంపనలు కుదిపేస్తున్న క్రమంలో.. ఏకంగా కేంద్రమంత్రి ఎంజే అక్బర్ తన పదవిని త్యజించాల్సి వచ్చిన నేపథ్యంలో దేశంలోని మహిళామణులు గతంలో తాము ఎదుర్కోన్న లైంగిక దాడులను, లైంగిక వేధింపులను నిర్బయంగా వెల్లడిస్తున్నారు. ఇదే సమయంలో అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సంచలనమైన తీర్పును వెలువరించింది.

ఇప్పటికే వ్యక్తి తన భార్య అయినా అమెకు ఇష్టంలేని సమయంలో సంబోగం చేసినా నేరమేనన్న వాదనలు తెరపైకి వస్తున్న క్రమంలో.. ఈ వాదనను బలపర్చేలా అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. ఓ మహిళ వ్యభిచారిణే అయినా, ఆమెకు ఇష్టం లేకుండా చేసే సంభోగం అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వ్యభిచారిణులు అయినా విటులను తిరస్కరించవచ్చని, ఆమె అంగీకరించకుండా కలిస్తే, రేప్ చేసినట్టేనని పేర్కొంది.

1997లో నమోదైన ఓ కేసు విచారణలో తుది తీర్పును ఇచ్చింది. అప్పట్లో తనపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారని ఓ వ్యభిచారిణి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసులో కింది కోర్టు అమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది.. నిందితులను దోషులుగా పరిగణించి.. శిక్షలు విధించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితులు ఢిల్లీ హైకోర్టును అశ్రయించారు. దాంతో ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు నిందితుకుల అనుకూలంగా తీర్పును వెలువరించింది.

కాగా, నిందితులు విధించిన శిక్షలు కూడా సగమే అమలయ్యాయి. దీంతో బాధితురాలు ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు లైంగిక కోరికను తీర్చుకునేందుకు యువతి అంగీకారం తప్పనిసరని, ఆమె అంగీకరించకుంటే, అది అత్యాచారమేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో అమె వ్యభిచారిని అయినా అమె అయిష్టంతో జరిపే సంబోఘం అత్యాచారమేనని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  Gangrape  Supreme Court  sex-workers  Delhi High Court  lower court  Crime  

Other Articles