300-crore transactions in auto driver account ఆటోడ్రైవర్ అకౌంట్ లో 300 కోట్ల లావాదేవీలు!

Autorickshaw driver summoned over pkr 300 crore transactions

Muhammad Rasheed, Auto Driver, salary account, Federal Investigation Agency, FIA, Pakistan Rupees 300 crore, Pakistan, International News, world News

The driver, identified as Muhammad Rasheed, who lives in Karachi, came to know about the huge transactions in his account when the Federal Investigating Agency (FIA) summoned him for an explanation.

షాకింగ్: ఆటోడ్రైవర్ అకౌంట్ లో 300 కోట్ల లావాదేవీలు!

Posted: 10/15/2018 02:54 PM IST
Autorickshaw driver summoned over pkr 300 crore transactions

సరిగ్గా లక్ష రూపాయలిస్తే.. లెక్కసరిగ్గా వుందో లేదో చూసుకునేందుకు వాటిని పదే పదే లెక్కించే సగటు వ్యక్తులు.. తమ బ్యాంకు అకౌంట్ల ద్వారా మాత్రం ఏకంగా కోటానుకోట్ల రూపాయల లావాదేవీలు జరిపారు. తన అకౌంట్లో ఇంత డబ్బుతో లావాదేవీలు జరిగాయా.? అన్న విషయం కూడా ఆయనకు తెలియదు. అయితే అది తన అకౌంటేనన్న విషయం కూడా ఆటో డ్రైవర్ మార్చిపోయాడు. కానీ తాజాగా అధికారులు గుర్తుచేయడంతో.. అది తన అకౌంటేనన్న తెలిసి విస్మయానికి గురయ్యాడు.

అయితే ఇది జరిగింది మన దేశంలో కాదు. మన దాయాధి దేశమైన పాకిస్తాన్ లో. తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరగడంపై పాకిస్థాన్ కు చెందిన ఓ ఆటోడ్రైవర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ దర్యాప్తు సంస్థ నుంచి అతనికి ఫోన్ కాల్ వచ్చే వరకూ ఈ విషయం అతనికి తెలియదు. కరాచీ పట్టణానికి చెందిన మహమ్మద్ రషీద్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అతని బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్టు ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్ఐఏ) అధికారులు రషీద్ కు ఫోన్ చేశారు.

ఈ విషయమై అధికారులు అతన్ని ప్రశ్నించారు. ఇన్ని కోట్ల రూపాయల లావాదేవీలు ఎలా జరిగాయో తనకు తెలియదని అధికారులకు చెప్పాడు. అయితే దీనిపై లోతుగా విచారణ చేస్తున్న అధికారులు బాధితుడి అకౌంట్ ను బ్యాంకు అధికారుల సహకారంతో రాజకీయ నేతలు వినియోగించారా.? లేక ప్రముఖ వ్యాపారవేత్తలు వినియోగించారా.? అసలిది ఎలా జరిగిందన్న కోణంలో విచారిస్తున్నారు. కాగా, ఎఫ్ఐఏ అధికారుల విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన రషీద్, విచారణ నిమిత్తం అధికారులు తనను పిలవగానే భయపడిపోయానన్నారు.

తన అకౌంట్ వివరాలు చూపిస్తూ ఇన్ని కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పడంతో ఆశ్చర్యపోయానని చెప్పాడు. అసలు తన జీవితంలో ఇంత వరకూ ఒక లక్ష రూపాయలు కూడా చూడలేదని, అలాంటిది మూడొందల కోట్ల రూపాయల లావాదేవీలు తన అకౌంట్ ద్వారా జరిగాయంటే నోట మాట రావడం లేదని చెప్పాడు. ఇప్పటికీ, అద్దె ఇంట్లోనే తాను ఉంటున్నానని, తన అకౌంట్ ను ఎవరో ఉపయోగించు కుంటున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. 2005లో ఓ ప్రైవేట్ కంపెనీలో కొన్ని నెలలు డ్రైవర్ గా పని చేసి మానేశానని, ఆ సమయంలో తన పేరిట బ్యాంకు ఖాతా తెరిచిన విషయాన్ని అధికారులకు చెప్పానని రషీద్ చెప్పుకొచ్చాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles