Home delivery of liquor may start in Maharashtra ఆన్ లైన్ లో అర్డర్.. ముంగిట్లోకి లిక్కర్..

Maharashtra to allow online sale home delivery of liquor

Maharashtra goverment, online liquor sale, home delivery of liquor, drunken driving cases, Maharashtra Excise Minister, Chandrashekhar Bawankule, Supreme Court, Revenue, Liquor, Online, Sale, Driving, Drunk, Revenue, Maharashtra, government

The Maharashtra government has decided to allow online sale and home delivery of liquor in the state, saying it could curb the cases of drunken driving.

మద్యం ప్రియులకు శుభవార్త.. ఇక హోం డెలివరీ కూడా..

Posted: 10/15/2018 01:38 PM IST
Maharashtra to allow online sale home delivery of liquor

మద్యం ప్రియులకు దసరా పండగ వేళ శుభవార్త అందింది. ఇకపై మీరు ఏ మద్యం కావాలన్న ఇకపై అర్ఢర్ చేసి.. హ్యాపీగా ఇంట్లోనే కూర్చోని వాటిని సేవించ అవకాశం లభింభనుంది. తాగి మద్యం సరిపోక రోడ్డుపైకి వెళ్లి మద్యం తెచ్చుకునే క్రమంలో పోలీసులకు చిక్కి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో ఇరుక్కుని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఇకపై లేదు. ఎందుకంటే అన్ లైన్ లో అర్డర్ చేస్తే.. మీ ముంగిట్లోకి లిక్కర్ వచ్చేస్తుంది. అయితే ఇది అన్ని ప్రాంతాల వారికి మాత్రం కాదు.

ఈ-కామర్స్ రంగం విస్తరించిన తర్వాత ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండానే కావాల్సిన వస్తువును తెప్పించుకునే వెసులుబాటు లభించింది. గుండు పిన్నుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు, చింతపండు నుంచి చాయ్ పొడి వరకు అన్నీ ఇలా ఆర్డర్ చేస్తే అలా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడిందులోకి మద్యం కూడా వచ్చి చేరింది. లిక్కర్‌ను డోర్ డెలివరీ చేయాలని  మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, దీని వెనుక ఓ లక్ష్యం ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.

డ్రంకెన్ డైవ్ కారణంగా పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి చంద్రశేఖర్ బవాంకులే తెలిపారు.  మద్యం ప్రియులు తాగి వాహనాలు నడుపుతున్నారని, ఫలితంగా ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వాటికి చెక్ పెట్టేందుకే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు చెప్పారు. అయితే, మద్యాన్ని ఎవరికి పడితే వారికి విక్రయించబోమని, ఆధార్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు.

మద్యం బాటిళ్లకు జియో ట్యాగింగ్ ఉంటుందని, కాబట్టి విక్రయాదారుడు-కొనుగోలుదారుడిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం ట్రాక్ చేస్తుందని వివరించారు. మద్యాన్ని డోర్ డెలివరీ చేయడం వల్ల కల్తీ మద్యాన్ని అరికట్టడంతోపాటు స్మగ్లింగ్ కూడా తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ విధానాన్ని కనుక అమల్లోకి తెస్తే.. మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డులకెక్కుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Liquor  Online  Sale  Driving  Drunk  Revenue  Maharashtra  government  

Other Articles