Fuel price hike continues; Petrol crosses 91 రికార్డులను అధిగమిస్తూ మరింత పైపైకి.. ఇంధన ధరలు..

Fuel price hike continues petrol crosses 91

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Prices of petrol and diesel continue on the daily record breaking upward movement on Monday, with petrol crossing the Rs.91 per litre mark in Mumbai and close to touching Rs.90 per litre in Patna

రికార్డులను అధిగమిస్తూ మరింత పైపైకి.. ఇంధన ధరలు..

Posted: 10/01/2018 11:03 AM IST
Fuel price hike continues petrol crosses 91

పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు నెలల కాలంగా దూకుడు పెంచుతున్నాయి. వాహనదారులు ఇంధన అంటే భయపడే పరిస్థితికి చేరుకుంటున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో ధరలు పెరుగుతున్నా కేంద్రం స్పందించి.. నాలుగున్నరేళ్ల హయాంలో రూ.11 మేర పెంచిన ఎక్సైజ్ సుంఖాన్ని తగ్గించే అవకాశాన్ని అసలు పరిశీలించడం లేదు. వాహనదారులు పర్సులు గుల్లచేయడమే కేంద్ర, చమురు సంస్థల టార్గెట్ గా చేసుకుందా అన్న అనుమానాలు వినిపిస్తుంది.

ఆల్ టైం రికార్డ్ దిశగా ఎప్పుడో చేరుకున్న ఇంధన ధరలు ఈ ఏడాది మే మాసం నుంచి పెరిగుతూ వచ్చినా.. క్రమంగా తగ్గముఖం పట్టాయి. ఆ తరువాత గత రెండు నెలలుగా అంటే ఆగస్టు నుంచి ఏకబిగిన పెరుగుతూనే వున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవాళ కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర ఏకంగా రూ.91 దాటిపోయింది. నగరంలో లీటరు పెట్రోల్‌ ధర 30పైసలు పెరిగి రూ.91.08గా ఉంది.

లీటర్‌ డీజిల్‌ ధర కూడా 32పైసలు పెరిగి రూ79.72గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇశాళ లీటరు పెట్రోల్‌ ధర 24పైసలు పెరిగి రూ.83.73గా ఉంది. లీటరు డీజిల్‌ ధర రూ.75.09గా ఉంది. ఢిల్లీలో సహజవాయువు ధరలు కూడా పెరిగాయి. దీని కారణంగా ప్రస్తుతం రాయితీ గల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.502.4కు చేరింది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.88.77కు చేరుకోగా, డీజిల్ ధర 81.68కి చేరుకుంది.

అటు బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర 84.40కి చేరుకోగా, డీజిల్ ధర 75.48కి చేరకుంది. ఇటు చెన్నైలో లీటరు పెట్రోల్ ధరలు 87.05కు చేరుకోగా, లీటరు డీజిల్ ధరలు 79.40కి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో దేశీయ ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి పెట్రోల్‌ ధరలు 8శాతం పెరగగా, డీజిల్‌ ధరలు 10శాతం పెరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles