YS jagan moved by little girl fan pain చిన్నారి అభిమానికి ఇలా లొంగిపోయిన జగన్

Ys jagan moved by little girl fan pain

ys jagan, YSRCP, padayatra, chandrampeta, bare foot, vizianagaram, andhra pradesh, politics

ys jagan keeps his shoe in support for his little girl fan, who came to see him from nearby village chandrampeta and lost her shoe in the rush and met the YSRCP President with bare foot in his walkathon in vizianagaram district.

చిన్నారి అభిమానికి ఇలా లొంగిపోయిన జగన్

Posted: 10/01/2018 11:39 AM IST
Ys jagan moved by little girl fan pain

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను అవగాహన చేసుకుంటూ ముందకు కదులుతున్న వైఎస్ జగన్.. ఇటీవల తన ప్రజాసంకల్ప పాదయాత్రను 3000 కిలోమీటర్ల మైలురాయిని కూడా తాకారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న ఆయన పాదయాత్రలో, ఓ ఆసక్తికర ఘటనతో కదిలిన ఆయన.. తన కోసం దూరం నుంచి వచ్చిన అభిమాని అభిమానం ముందు ఆయన లొంగిపోయారు. అదేలా అంటే.. వివరాల్లోకి వెళ్లాల్సిందే..

విజయనగరం జిల్లాలోని బీమసింగి సంక్షన్ నుంచి బలరామపురం మధ్యలో చంద్రంపేటకు చెందిన చలుమూరి ఏలేష్, రమణమ్మ దంపతులు, తమ పిల్లలతో కలసి పాదయాత్రలో జగన్ తో పాటు నడిచారు. ఈ సమయంలో ఎండ చాలా ఎక్కువగా ఉంది. స్వల్ప తొక్కిసలాట జరగడంతో రమణమ్మ కుమార్తె సంగీత ఒక చెప్పు ఎక్కడో జారిపోయింది. చెప్పు కోసం తన అన్న జగన్ కు దూరం కావడం ఇష్టంలేని సంగీత, ఒక చెప్పుతోనే నడిచే ప్రయత్నం చేసింది.

దీన్ని చూసిన జగన్, "కాళ్లు కాలిపోతాయి తల్లీ" అని అన్నారు. అన్నా నిన్ను చూసిన ఆనందం, నీతో కలసిన ఆనందం ముందు ఏం జరిగినా ఫర్వాలేదని సంగీత అనింది. ఎండకు ఇబ్బంది పడుతున్నావమ్మా అంటూ, తన సెక్యూరిటీకి, చెప్పు ఎక్కడ పడిందో చూసి తేవాలని పురమాయించారు. వారు చెప్పును వెతికి తెచ్చేంత వరకూ సంగీత కాలు కాలకుండా, తన పాదాన్ని ఆమె పాదానికి ఆసరా ఇచ్చారు జగన్. సెక్యూరిటీ సిబ్బంది చెప్పును తెచ్చేంత వరకూ ఆ చిన్నారితో మాట్లాడుతూ ఉన్న జగన్, అంతసేపూ ఆమె కాలికిందనే తన కాలును ఉంచారు. ఆపై జగన్ వెంట సంగీత మరికొంత దూరం నడిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  YSRCP  padayatra  chandrampeta  bare foot  vizianagaram  andhra pradesh  politics  

Other Articles