Model code implies in Telanagana: EC తెలంగాణలో ఎన్నికల కోడ్.. ఆలస్యంగా మేల్కోన్న ఈసీ

Model code to kick in right after premature dissolution of assembly ec

Telangana Assembly Elections 2018, Election Commission of India, election code in telangana, Telangana Assembly, Election code, TS Assembly Elections, Election Commission of India, Election code. telangana, politics

The Election Commission has directed that model code of conduct will henceforth apply n poll-bound Telangana to caretaker state governments right from dissolution of the state assembly.

తెలంగాణలో ఎన్నికల కోడ్.. ఆలస్యంగా మేల్కోన్న ఈసీ

Posted: 09/27/2018 07:48 PM IST
Model code to kick in right after premature dissolution of assembly ec

తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వుందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే స్వయంగా ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన మండలిలో విధాన పరమైన ప్రకటన చేసిన నేపథ్యంలో అలస్యంగా మేల్కొన్న ఎన్నికల కమీషన్.. తెలంగాణలో ఎన్నికల నియమావళి అమల్లో వుందని ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ రద్దయిన నాటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని కమిషన్ స్పష్టం చేసింది.

ఎన్నికలు జరగడం, ఆపై నూతన అసెంబ్లీ ఏర్పడే వరకు తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. ఈ సందర్భంగా అపధర్మ ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూ ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు చేయడానికి, తీసుకోవడానికి కానీ వీలులేదని లేదని తెలిపింది. దీంతో పాటుఆపద్ధర్మ ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించరాదని ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఓ లేఖ రాసింది.

మరోవైపు ముందస్తు ఎన్నికలకు తెలంగాణలోని రాజకీయ పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. టీఆర్ఎస్ అయితే అసెంబ్లీ రద్దయిన రోజే 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం కోసం 9 కీలక కమిటీలను నియమించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ రద్దు అనేది ప్రజాధనం దుర్వినియోగమని, రాజ్యంగానికి విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles