Ayodhya verdict: Supreme Court upholds 1994 judgement అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Sc declines to refer ayodhya case to larger bench hearing on title suit on october 29

CJI Dipak Misra, Justice Ashok Bhushan, Justice S Abdul Nazeer, ayodhya verdict, ayodhya verdict live, ayodhya verdict in supreme court, supreme court judgement, supreme court of india, supreme court verdict aadhaar, supreme court judge, supreme court live, ayodhya verdict, ayodhya news, mosque integral part of islam, is mosque integral to islam, babri masjid, babri masjid case, babri masjid ayodhya, babri masjid film, Ram Janmabhoomi case, Ram Janmabhoomi case

The Supreme Court today declined to refer the question that “a mosque as a place of prayer is an essential part of Islam” to a Constitution bench.

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Posted: 09/27/2018 05:54 PM IST
Sc declines to refer ayodhya case to larger bench hearing on title suit on october 29

అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కేసును విస్తృత ధర్మాసనానికి బదలాయించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. అక్టోబరు 29న అయోధ్య కేసును విచారిస్తామని సీజేఐ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ నజీర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అయోధ్య కేసు భూవివాదంగానే చూస్తామని..భూ యాజమాన్య హక్కులపై అక్టోబరు 29 నుంచి విచారిస్తామని స్పష్టంచేసింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనమే వాదనలు వింటుందని తెలిపింది.

ఇక 1994 నాటి ఫరూఖీ కేసు తీర్పును పునర్విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నమాజు మసీదులోనే కాదు..ఎక్కడైనా చేయొచ్చంటూ 1994లో తీర్పు వచ్చింది. అప్పటి తీర్పును సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో సమర్థించింది. ఐతే చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ వాదనతో జస్టిస్ నజీర్ ఏకీభవించలేదు. 1994 నాటి తీర్పును పున:సమీక్షించాలని..కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సూచించారు.

కాగా, అన్ని ఆలయాలు, మసీదులు, చర్చిలకు సమాన ప్రాధాన్యమివ్వాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలు చేయాలంటూ 2010లో అలహాబాద్‌ కోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అయోధ్య కేసును త్రిసభ్య ధర్మసనమే విచారించనుండడంతో..సత్వర విచారణకు అడ్డంకులు తొలిగాయి. 2019 ఎన్నికల ముందే తుది తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ayodhya  supreme court  judgement  islam  babri masjid  Ram Janmabhoomi case  

Other Articles